Thursday, 28 February 2019

స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌

*సమాజంలోని వివిధ సమస్యలకు సాంకేతికత ద్వారా పరిష్కారం చూపేందుకు దేశవ్యాప్తంగా విద్యార్థులు సిద్ధమయ్యారు.
**స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌-2019 పోటీల్లో తమ సత్తా చాటనున్నారు.
**అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) ఆధ్వర్యంలో మార్చి 2, 3 తేదీల్లో విరామం లేకుండా 36 గంటలపాటు పోటీలు సాగనున్నాయి.
**సమస్యల పరిష్కారంలో నేటి తరానికి భాగస్వామ్యం కల్పించాలని, ముఖ్యంగా ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ** 2017లో మొదటిసారిగా స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌కు ఏఐసీటీఈ శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ఆనాడు మొత్తం లక్ష మంది విద్యార్థులు పాల్గొన్నారు. తొలిసారి కేవలం సాఫ్ట్‌వేర్‌ ద్వారా పరిష్కారానికి పోటీలు నిర్వహించగా గతేడాది నుంచి హార్డ్‌వేర్‌ పోటీలను కూడా ప్రారంభించారు. ఈసారి పోటీల్లో(సాఫ్ట్‌వేర్‌) వ్యర్థాల నిర్వహణ, స్మార్ట్‌ వాహనాలు, ఫుడ్‌ టెక్నాలజీ, రోబోటిక్స్‌- డ్రోన్లు, స్వచ్ఛమైన నీరు, భద్రత-నిఘా తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలతోపాటు ప్రైవేట్‌ సంస్థలు మొత్తం 532 సమస్యలను ప్రకటించాయి. 
**పోటీల నిర్వహణకు దేశంలో 48 కళాశాలలు నోడల్‌ కేంద్రాలుగా ఎంపికయ్యాయి. తెలంగాణలో ఎన్‌ఐటీ వరంగల్‌, హైదరాబాద్‌లోని సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, ఏపీలోని తిరుపతి ఎస్‌వీ ఇంజినీరింగ్‌ కళాశాల, భీమవరంలోని సాగి రామకృష్ణంరాజు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పోటీలు జరగనున్నాయి. నిపుణుల సమక్షంలో సమస్యకు పరిష్కారం కనుగొనాలి. 

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...