Saturday, 9 February 2019

ఏపీ వైద్యారోగ్యశాఖలో 1900 ఉద్యోగాలు

ఏపీ వైద్యారోగ్యశాఖలో 1900 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 1900 ఏఎన్‌ఎం, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఎంపీహెచ్‌ఏ) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
జిల్లాల వారీ ఖాళీలు: శ్రీకాకుళం-52, విజయనగరం-29, విశాఖపట్నం-150, తూర్పుగోదావరి-227, పశ్చిమ గోదావరి-193, కృష్ణా-168, గుంటూరు-242, ప్రకాశం-99, నెల్లూరు-176, చిత్తూరు-182, వైఎస్సార్-97, అనంతపురం-140, కర్నూలు-145. 
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఏపీ నర్సింగ్ అండ్ మిడ్‌వైవ్స్ కౌన్సిల్ నుంచి ఎంసీహెచ్‌ఏ కోర్సు చేసి ఉండాలి లేదా ఇంటర్ ఒకేషనల్ (ఎంపీడబ్ల్యూహెచ్) కోర్స్ పూర్తిచేసి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాది క్లినికల్ అనుభవం ఉండాలి. 
వయసు: ఫిబ్రవరి 1, 2019 నాటికి గరిష్టంగా 42 ఏళ్లు ఉండాలి. నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. 
దరఖాస్తు ఫీజు: రూ.300. 
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తుకు డీడీ జతచేసి సంబంధిత జిల్లా కార్యాలయంలో అందించాలి.
దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 20, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://cfw.ap.nic.in

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...