Saturday, 9 February 2019

సింధు= కోహ్లి

క్రికెటర్లు వందల కోట్ల రూపాయలు ఆర్జిస్తే.. పదుల కోట్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటే ఆశ్చర్యమేమీ లేదు. క్రికెట్‌ అంటే పడిచచ్చే దేశంలో ఎన్నో ఏళ్లుగా చూస్తున్న వ్యవహారమే ఇది.
ఆదాయం విషయంలో క్రికెటర్లతో వేరే క్రీడాకారులకు పోలికే ఉండేది కాదు ఒకప్పుడు.
 కానీ ఇప్పుడు ఒక షట్లర్‌  ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న క్రికెటర్‌ విరాట్‌ కోహ్లికి సమాన స్థాయిలో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది.
ఆ షట్లర్ మరెవరో కాదు.. పూసర్ల వెంకట సింధు. కోహ్లి 8 ఏళ్ల కాలానికి రూ.100 కోట్లతో ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటే.. సింధు నాలుగేళ్ల కాలానికి ఒప్పందం కింద రూ.50 కోట్లు దక్కించుకోవడం విశేషం.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...