Tuesday, 5 February 2019

NTA UGC NET Exam: యూజీసీ నెట్(జూన్)- 2019 ఎగ్జామ్

NTA UGC NET Exam: యూజీసీ నెట్(జూన్)- 2019 ఎగ్జామ్

కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు

దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ (జూన్) - 2019 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు మార్చి 1 నుంచి ఆన్‌లైన్ ద్వారా యూజీసీ నెట్ 2019 పరీక్షకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 30తో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. 
నోటిఫికేషన్ 


జూన్ 20 నుంచి 28 వరకు నెట్ పరీక్షలను నిర్వహించనున్నారు. అయితే ఈ సంవత్సరం నుంచి కొత్త సిలబస్ ప్రకారం నెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. పరీక్షల సిలబస్‌ను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. 
కొత్త సిలబస్ కోసం క్లిక్ చేయండి.. 
పరీక్ష విధానం.. 
ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి మూడు గంటల సమయం ఉంటుంది. పేపర్-1కు గంట, పేపర్-2 కు రెండు గంటల సమయం ఉంటుంది. పేపర్-1 లో 100 మార్కులకుగాను 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. టీచింగ్, రిసెర్చ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇక పేపర్-2లో 200 మార్కులకుగాను 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అభ్యర్థుల ఆప్షనల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి.

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...