పేద రైతులకు ఏడాదికి రూ.6000
సార్వత్రిక ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో రైతులకు కేంద్రం వరాలు కురిపిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పేద రైతులకు ఏడాదికి రూ. 6000 ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఐదు ఎకరాల్లోపు భూమి ఉండే ప్రతి రైతుకు మూడు వాయిదాల్లో ఈ మొత్తం చెల్లించనున్నారు. నేరుగా వారి ఖాతాల్లోకి ఈ సొమ్మును బదిలీ చేయనున్నట్లు ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఈ పథకంతో 12 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనున్నట్లు తెలిపారు. దీంతో ప్రభుత్వ ఖజానాపై రూ. 75వేల కోట్ల అదనపు భారం పడనుందని పేర్కొన్నారు.
No comments:
Post a Comment