Thursday, 7 March 2019

ఎఫ్‌సీఐ 4,103 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) దేశవ్యాప్తంగా పలు కేటగిరిల్లో 4,103 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఐదు జోన్లల్లో పోస్టుల భర్తీని చేపట్టనుంది. తెలుగు రాష్టాలుండే సౌత్ జోన్‌లో పోస్టుల సంఖ్య 540. వీటిల్లో జూనియర్ ఇంజనీర్‌లు, (సివిల్, ఎలక్ట్రికల్ మెకానికల్), అసిస్టెంట్ గ్రేడ్2(హిందీ),అసిస్టెంట్ గ్రేడ్3 (జనరల్, అకౌంట్స్, టెక్నికల్, డిపో), టైపిస్టు(హిందీ), పోస్టులు ఉన్నాయి. రెండు దశల్లో జరిపే ఆన్‌లైన్ పరీక్షల ద్వారా పోస్టులను భర్తీ చేస్తారు.
Jobsపోస్టులు వివరాలు..ఖాళీల సంఖ్య: 4,103
సౌత్‌జోన్ - 540, నార్త్‌జోన్ -1,999, ఈస్ట్‌జోన్ -538, వెస్ట్‌జోన్ -735, నార్త్‌ఈస్ట్ -291 
గమనిక: అభ్యర్థులు ఏదైనా ఒక జోన్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

సౌత్ జోన్‌లో 540 ఖాళీలు: 
  • సౌత్ జోన్‌లో జూనియర్ ఇంజనీర్ (సివిల్)-26, జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్ మెకానికల్)-15, స్టెనో గ్రేడ్2-7, అసిస్టెంట్ గ్రేడ్-2(హిందీ)-15, టైపిస్ట్(హిందీ)-3, అసిస్టెంట్ గ్రేడ్ 3 (జనరల్)-159, అసిస్టెంట్ గ్రేడ్(ఏజీ) 3(అకౌంట్స్)- 48, ఏజీ3 (టెక్నికల్)-54, ఏజీ3(డిపో)- 213

అర్హతలు..జూనియర్ ఇంజనీర్(సివిల్): సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ/డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి. డిప్లొమా అభ్యర్థులకు సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం అవసరం.
జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్): డిగ్రీ/డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజనీరింగ్. డిప్లొమా అభ్యర్థులకు సదరు రంగంలో ఏడాది అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 28 ఏళ్లు

స్టెనో గ్రేడ్-2: డిగ్రీతోపాటు డీఓఈఏసీసీ(డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అక్రిడియేషన్ ఆఫ్ కంప్యూటర్ కోర్సెస్)లో లెవల్ ఓ అర్హత ఉండాలి. (లేదా) కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్‌లో డిగ్రీ ఉండాలి. వీటితోపాటు టైపింగ్ నిమిషానికి 40 పదాలు, షార్ట్‌హ్యాండ్‌లో 80 పదాలు టైప్ చేయగలగాలి. 
వయోపరిమితి: 25 ఏళ్లు

అసిస్టెంట్ గ్రేడ్-2(హిందీ): ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హిందీ ఒక ప్రధాన సబ్జెక్టుగా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఇంగ్లిష్ భాషలో నైపుణ్యం ఉండాలి. ఇంగ్లిష్ నుంచి హిందీలోకి, హిందీ నుంచి ఇంగ్లిష్‌లోకి అనువాదం చేయగలగాలి. హిందీలో పీజీ పూర్తిచేసి ఉండటం అభిలషణీయం. 
వయోపరిమితి: 28 ఏళ్లు

టైపిస్ట్(హిందీ): డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు హిందీలో నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలగాలి. హిందీ, ఇంగ్లిష్ టైపింగ్ వచ్చి కంప్యూటర్ పరిజ్ఞానం తెలిసి ఉండాలి.
వయోపరిమితి: 25 ఏళ్లు

అసిస్టెంట్ గ్రేడ్-3(జనరల్): ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
వయోపరిమితి: 27 ఏళ్లు

అసిస్టెంట్ గ్రేడ్-3 (అకౌంట్స్): కామర్స్ డిగ్రీతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి: 27 ఏళ్లు

అసిస్టెంట్‌గ్రేడ్-3(టెక్నికల్): బీఎస్సీ (అగ్రికల్చర్), బీఎస్సీ(బోటనీ/జువాలజీ/బయోటెక్నాలజీ /బయోకెమిస్ట్రీ/మైక్రోబయాలజీ/ఫుడ్ సైన్స్) (లేదా) బీఈ/బీటెక్(ఫుడ్ సైన్స్/ఫుడ్ సైన్స్- టెక్నాలజీ/అగ్రికల్చరల్ ఇంజనీరింగ్/బయోటెక్నాలజీ) విద్యార్హత ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
వయోపరిమితి: 27 ఏళ్లు

అసిస్టెంట్ గ్రేడ్ -3 (డిపో): ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాట కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
వయోపరిమితి: 27 ఏళ్లు

రెండు దశల్లో ఆన్‌లైన్ పరీక్షలు : 
పోస్టులను బట్టి ఎంపిక ప్రక్రియ వేర్వేరుగా ఉంటుంది. మొదట రెండు దశల్లో (ఫేజ్-1, ఫేజ్-2)... రెండు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను షార్ట్‌లిస్టు చేస్తారు. అన్ని పోస్టులకు మొదటి దశలో ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. మొదటి దశలో అర్హత సాధించిన వారిని.. తర్వాతి దశ పరీక్షలకు అనుమతిస్తారు. మొదటి దశలో పొందిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. 

ఫేజ్1 పరీక్ష విధానం : ఇంగ్లిష్, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ సెక్షన్ల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్‌కు 30, రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ విభాగాలకు 35 చొప్పున మార్కులు కేటాయించారు. ప్రతి సెక్షన్‌కు విడివిడిగా 20 నిమిషాల సమయం ఉంటుంది. మొత్తంగా 100 మార్కులకు గంట వ్యవధిలో పరీక్ష జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంది. ప్రతి సరికాని సమాధానానికి 1/4 మార్కు కోత ఉంటుంది. 

ఫేజ్ 2 పరీక్ష విధానం : మొదటి దశ దాటిన వారికి రెండో దశలో వేర్వేరుగా అయిదు పేపర్లు ఉంటాయి. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న ఆయా పోస్టుల ఆధారంగా హాజరుకావాలి. 
  • ఏజీ 3 జనరల్, డిపో పోస్టులకు సంబంధించి రెండో దశలో.. పేపర్1కు మాత్రమే హాజరు కావాలి.
  • టైపిస్టు (హిందీ) పోటీ పడే వారు పేపర్ 3కు మాత్రమే హాజరుకావాలి
  • స్టేనో గ్రేడ్ 2కు పోస్టుకు హాజరయ్యే వారు పేపర్ 5కు రాయాలి.
  • జూనియర్ ఇంజనీర్, ఏజీ 3(అకౌంట్స్, టెక్నికల్) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారు పేపర్1,2లు రాయాలి.
  • ఏజీ 2 (హిందీ) రాసే అభ్యర్థులు పేపర్ 3,4లు రాయాల్సి ఉంటుంది.
  • పేపర్ 1, 3, 5: వీటి పరీక్ష స్వరూపం ఒకే విధంగా ఉంటుంది. 120 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. రెండు గంటల సమయం కేటాయిస్తారు. ప్రతి సరికాని సమాధానానికి 1/4 మార్కుల కోత ఉంటుంది. ఆయా పేపర్ల సిలబస్ వేర్వేరుగా ఉంటుంది.
  • పేపర్1లో... రీజనింగ్/జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లిష్, కంప్యూటర్ ప్రొఫిషియోన్సీ, జనరల్ అవేర్‌నెస్, కరెంట్ ఈవెంట్స్, డేటా అనాలసిస్/న్యూమరికల్ ఎబిలిటీ/డేటా ఇంటర్‌ప్రిటేషన్ అంశాలు ఉన్నాయి.
  • పేపర్ 3లో... జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ నాలెడ్జ్ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.
  • పేపర్ 5లో.. జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ నాలెడ్జ్ (ఎంఎస్ వర్డ్, ఇంటర్నెట్) అంశాలపైన ప్రశ్నలు ఉంటాయి
  • పేపర్ 2: పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టు నుంచి 60 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. పరీక్ష వ్యవధి ఒక గంట.
  • పేపర్ 4: ఇది సబ్జెక్టివ్ ఆన్‌లైన్ టెస్ట్. ఇందులో రెండు ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు 60 మార్కుల చొప్పున మొత్తం 120 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. నెగిటివ్ మార్కులు ఉండవు.
  • టైపిస్టు(హిందీ), స్టెనో గ్రేడ్ 2లకు ఫేజ్ 2 అనంతరం స్కిల్ టెస్టు ఉంటుంది. టైపిస్టుకు దరఖాస్తు చేసుకున్న వారు టైపింగ్ టెస్టు, స్టెనోకు దరఖాస్తు చేసుకున్న వారు టైపింగ్, షార్ట్‌హ్యాండ్ స్కిల్ టెస్టుకు హాజరవ్వాలి. తుదిగా 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన జరుపుతారు.

ముఖ్య సమాచారం : ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 2019 మార్చి 25
దరఖాస్తు రుసుం: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు మినహాయింపునిచ్చారు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: fci.gov.in

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...