Thursday, 7 March 2019

అత్యుత్తమ పరిశుభ్ర నగరం ఇండోర్‌

మధ్యప్రదేశ్‌కు చెందిన ఇండోర్‌ దేశంలోనే అత్యుత్తమ పరిశుభ్ర నగరంగా వరుసగా మూడోసారి ఎంపికయ్యింది. ద్వితీయ స్థానంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అంబికాపుర్‌, తృతీయ స్థానంలో కర్ణాటకకు చెందిన మైసూర్‌ నిలిచాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2019 అవార్డులను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రదానం చేశారు. న్యూదిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌కు చిన్న నగరాల జాబితాలో ఉత్తమ పరిశుభ్రత అవార్డు లభించింది. ఉత్తరాఖండ్‌లోని గౌచర్‌ (బెస్ట్‌ గంగా టౌన్‌), అహ్మదాబాద్‌ (క్లీనెస్ట్‌ బిగ్‌ సిటీ), రాయ్‌పుర్‌ (ఫాస్టెస్ట్‌ మూవింగ్‌ బిగ్‌ సిటీ),  ఉజ్జయిన్‌( క్లీనెస్ట్‌ మీడియం సిటీ), మథుర-బృందావన్‌ (ఫాస్టెస్ట్‌ మూవింగ్‌ మీడియం సిటీ) పురస్కారాలను అందుకున్నాయి.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...