Saturday, 23 March 2019

లోక్‌పాల్‌గా జస్టిస్‌ ఘోష్‌

భారత తొలి లోక్‌పాల్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ శనివారం ప్రమాణస్వీకారం చేశారు.
 రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. జస్టిస్‌ ఘోష్‌ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయ్ హాజరయ్యారు.
లోక్‌పాల్‌ను ఏర్పాటుచేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ జస్టిస్‌ ఘోష్‌ను లోక్‌పాల్‌ చీఫ్‌గా ఎంపిక చేసింది. పారా మిలటరీ దళమైన ‘సశస్త్ర సీమా బల్‌’ (ఎస్‌ఎస్‌బీ) మాజీ అధిపతి అర్చనా రామసుందరం, మహారాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్‌ జైన్‌తోపాటు మహేంద్ర సింగ్‌, ఇందర్‌జీత్‌ ప్రసాద్‌ గౌతమ్‌లను లోక్‌పాల్‌లో నాన్‌ జ్యుడిషియల్‌ సభ్యులు, జస్టిస్‌ దిలీప్‌ బి భోసలే, జస్టిస్‌ ప్రదీప్‌ కుమార్‌ మహంతి, జస్టిస్‌ అభిలాషా కుమారి, జస్టిస్‌ అజయ్‌ కుమార్‌ త్రిపాఠిలను జ్యుడిషియల్‌ సభ్యులుగా ఎంపిక చేశారు. వీరి పేర్లను రాష్ట్రపతికి పం
పగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు.
 కేంద్ర స్థాయిలో లోక్‌పాల్‌ను, రాష్ట్ర స్థాయిలో లోకాయుక్త నియామకానికి ఉద్దేశించిన లోక్‌పాల్‌, లోకాయుక్త చట్టం 2013లో ఆమోదం పొందింది. సిట్టింగ్‌ ఎంపీలు, కేంద్ర, రాష్ట్రాల మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులపై వచ్చే అవినీతి కేసులపై దర్యాప్తు చేసే అధికారం లోక్‌పాల్‌కు ఉంటుంది. 

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...