Sunday, 10 March 2019

జపాన్‌ పేరిట ఉన్న రికార్డును తిరగరాసిన ‘పానీపత్‌ పింకథాన్‌, 2019

  • అంతర్జాతీయ మహిళా దినోత్సవాన భారత వనితలు సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. పానీపత్‌ నగరంలో ఒకేసారి 50 వేల మంది పరుగెత్తి చరిత్ర సృష్టించారు.
  • ఇంతవరకు జపాన్‌ పేరిట ఉన్న రికార్డును తిరగ రాశారు. ఆ దేశంలో ఒకేసారి 25 వేల మంది మహిళలు పరుగెత్తగా హరియాణాలో అంతకు రెట్టింపు సంఖ్యలో వనితలు పాల్గొనడం విశేషం. ‘పానీపత్‌ పింకథాన్‌, 2019’ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అమర జవాన్లకు అంకితం చేస్తూ.. ఈ కార్యక్రమాన్ని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. పింకథాన్‌తో నగర రహదారులన్నీ గులాబీ వర్ణ శోభితమయ్యాయి.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...