Sunday, 10 March 2019

ఉపరాష్ట్రపతికి గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసిన ‘యూనివర్సిటీ ఆఫ్‌ పీస్‌’

  • భారతదేశ సుస్థిర అభివృద్ధి, ప్రజాస్వామ్యం, చట్టాలకు అందించిన సేవలకుగాను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడిని గౌరవ డాక్టరేట్‌ వరించింది. ఐరాస ఆధ్వర్యంలో ఏర్పాటైన ‘‘యూనివర్శిటీ ఆఫ్‌ పీస్‌’’ ఈ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. కోస్టారికా రాజధాని సాన్‌జోస్‌లో జరిగిన కార్యక్రమంలో యూనివర్శిటీ డీన్‌ నుంచి ఆయన ‘డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ’ అందుకున్నారు.
  • ఈ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకున్న తొలి భారతీయుడిగా ఆయన చరిత్ర సృష్టించారు.
  • శాంతి ప్రబోధకుడైన మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో ఈ గౌరవాన్ని అందుకోవడాన్ని ఎప్పటికీ మరిచిపోలేను’’ అని ఆనందం వ్యక్తం చేశారు. 
  • 2017లో భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఆయన దేశంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజాస్వామ్యం, చట్టాలు, సంకుచిత భావాల నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...