Sunday, 10 March 2019

పాక్ సెనేట్‌కు అధ్యక్షత వహించిన కృష్ణకుమారి


  • హిందూ దళిత సామాజిక వర్గం నుంచి పాకిస్థాన్ సెనేటర్ (పార్లమెంట్ సభ్యురాలు)గా ఎన్నికైన తొలి మహిళగా చరిత్ర సృష్టించిన కృష్ణకుమారి కోహ్లీ మరో విశిష్టమైన గౌరవాన్ని పొందారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె పాక్ పార్లమెంట్ ఎగువ సభ సమావేశానికి అధ్యక్షత వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా  సెనేట్‌కు మా సహచరిణి కృష్ణకుమారి కోహ్లీ అధ్యక్షతన సమావేశం నిర్వహించాలని సెనేట్ చైర్మన్ నిర్ణయించారు
  • పాకిస్థాన్‌లో వెట్టి కార్మికుల హక్కుల కోసం ఎన్నో ఏండ్లు కృషిచేసిన కృష్ణకుమారి కోహ్లీ (40) గతేడాది మార్చిలో సెనేటర్‌గా ఎన్నికయ్యారు. సింధ్ రాష్ట్రంలో హిందువులు అధికంగా జీవిస్తున్న నగర్‌పర్కార్ ప్రాంతంలోని మారుమూల గ్రామం ధనగామ్‌కు చెందిన కృష్ణకుమారి.. కోహ్లీ సామాజిక వర్గానికి చెందినవారు.
  • 1979లో జుగ్నూ కోహ్లీ అనే పేద రైతుకు జన్మించిన కృష్ణకుమారి, ఆమె కుటుంబ సభ్యులు ఉమెర్కోట్ జిల్లాలో ఓ భూస్వామికి చెందిన ప్రైవేట్ జైలులో దాదాపు మూడేండ్లపాటు నిర్బంధానికి గురయ్యారు. బందీగా పట్టుబడే నాటికి మూడో తరగతి చదువుతున్న కృష్ణకుమారి తన 16వ ఏట (తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు) లాల్‌చంద్‌ను వివాహం చేసుకున్నారు. 2013లో సింధ్ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. తన సోదరునితో కలిసి పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)లో చేరారు. ఆ తర్వాత కృష్ణకుమారి సోదరుడు బెరానో యూనియన్ కౌన్సిల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...