Wednesday, 6 March 2019

వందశాతం విద్యుదుత్పత్తితో సింగరేణి కొత్త రికార్డు

సింగరేణి అంటే బొగ్గు గనులే అందరికీ గుర్తుకొస్తాయి. కానీ, విద్యుదుత్పత్తిలోనూ ఈ సంస్థ సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. మంచిర్యాల జిల్లా జైపూర్‌ గ్రామం వద్ద గల సింగరేణి థర్మల్‌ విద్యుత్కేంద్రం(ఎస్టీపీపీ) గత నెలలో వందశాతం విద్యుదుత్పత్తి(పీఎల్‌ఎఫ్‌) సాధించింది.
*ఈ కేంద్రంలో ఒక్కోటీ 600 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంగల రెండు ప్లాంట్లు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ కేంద్రం గత ఏడాది సెప్టెంబరులో ఒకసారి, తిరిగి గత నెలలో మరోసారి రికార్డు స్థాయిలో వందశాతం పీఎల్‌ఎఫ్‌ సాధించింది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల్లో రాష్ట్రాలవారీగా చూస్తే ఒడిశా ప్రభుత్వ విద్యుదుత్పత్తి సంస్థ(ఓపీజీసీ) 83.93 శాతం ఉత్పత్తితో అగ్రస్థానంలో ఉండగా సింగరేణి 80.22 శాతంతో రెండో స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్ర జెన్‌కో 77.28 శాతంతో మూడో స్థానంలో ఉంది.
*ఒడిశాలో 420 మెగావాట్ల విద్యుత్కేంద్రాన్ని మాత్రమే ఆ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చూపడంతో 83.93 శాతం పీఎల్‌ఎఫ్‌ సాధ్యమైంది. కానీ, సింగరేణికి 1200, తెలంగాణ జెన్‌కోకు 3682 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ ఏకంగా 77 నుంచి 80శాతం పీఎల్‌ఎఫ్‌ సాధిస్తుండటం విశేషం. 
* దేశంలో 90 శాతానికిపైగా పీఎల్‌ఎఫ్‌ నమోదవుతున్న విద్యుత్కేంద్రాలు చాలా తక్కువగా ఉన్నాయి. 
* గత ఆర్థిక సంవత్సరం(2017-18)లో సింగరేణి విద్యుత్కేంద్రం 91.09 శాతంతో దేశంలో 5వ స్థానంలో నిలిచి రూ.400 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 
* వార్షిక మరమ్మతుల కోసం ఈ ఏడాది 40 రోజులపాటు కార్యకలాపాలు ఆపివేయడంతో ఈ సారి 2017-18 స్థాయిలో ఉత్పత్తి జరగలేదు. 

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...