Thursday, 7 March 2019

కడప, విశాఖ జిల్లాలకు జాతీయ అవార్డు

ఆంధ్రప్రదేశ్‌లోని కడప, విశాఖ జిల్లాలకు నీతి ఆయోగ్‌ అవార్డులు లభించాయి. నవంబరు- డిసెంబరు, 2018 మధ్య వ్యవసాయం, జలవనరుల విభాగంలో డ్యాష్‌బోర్డులో ముందుస్థానంలో ఉన్న కడప జిల్లాకు నీతి ఆయోగ్‌ డెల్టా ప్రథమ ర్యాంకు అవార్డు దక్కింది.  డిసెంబరు 2018 - జనవరి 2019 మధ్య విద్యా విభాగంలో విశాఖ జిల్లాకు నాలుగో ర్యాంకు లభించింది. దేశవ్యాప్తంగా ఆకాంక్షిత జిల్లాల్లో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) అమలుపై బుధవారమిక్కడ నీతి ఆయోగ్‌ సదస్సు నిర్వహించింది. ఆరోగ్యం, విద్య, జలవనరుల విభాగంలో రాష్ట్రాల ప్రతినిధుల ఆలోచనలు పంచుకొన్నారు. నవంబరు-డిసెంబరు 2018, జనవరి 2019ల్లో డ్యాష్‌బోర్డులో మార్పులను అనుసరించి డెల్టా ర్యాంకులకు అనుగుణంగా పురోగతి సాధిస్తున్న 18 ఆకాంక్షిత జిల్లాల ప్రతినిధులను అవార్డు, ప్రశంసాపత్రంతో నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ సత్కరించారు. కడప జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు జె.మురళీకృష్ణ, ముఖ్య ప్రణాళిక అధికారి వి.తిప్పేస్వామి అవార్డు అందుకొన్నారు. విశాఖ అవార్డును జిల్లా డీఈవో లింగేశ్వరరెడ్డి, పాడేరు ఐటీడీఏ పీవో బాలాజీ అందుకొన్నారు. ‘ఆరోగ్యం.. న్యూట్రిషన్‌’, ‘వ్యవసాయం..జలవనరులు’, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక, ప్రాథమిక మౌలికవసతుల రంగాల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా డెల్టా ర్యాంకులు ఇచ్చారు.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...