Friday, 8 March 2019

విమానాశ్రయాల అభివృద్ధికి రూ.4.500 కోట్లు

దేశంలోని వివిధ ప్రాంతాలకు విమానసర్వీసులను చేరువచేసే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా సర్వీసులో ఉన్న, లేనటువంటి  వివిధ విమానాశ్రయాల పునరుద్ధరణ, అభివృద్ధికి రూ.4,500 కోట్లను కేటాయించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. దీంతో దేశంలోని చిన్న పట్టణాలు, నగరాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధి జరగటంతోపాటు.. ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దోహదపడుతుందని వివరించింది.

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...