Saturday, 16 March 2019

33శాతం వృద్ధితో ఏప్రిల్‌ -ఫిబ్రవరి (2018-19)లో రూ. 1,77,213.57 కోట్లకు బీమారంగం ఆదాయం

దేశీయ బీమా రంగం ఈ ఏడాది ఫిబ్రవరిలో 32.7 శాతం వృద్ధిని నమోదు చేసిందని, ప్రీమియం చెల్లింపులు రూ. 18,209 కోట్లకు చేరాయని ఇన్స్యూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐఆర్‌డీఏఐ) నివేదికలో వెల్లడైంది. గత ఏడాది ఇదే నెలలో ప్రీమియం చెల్లింపులు రూ. 13,724.96 కోట్లుగా ఉన్నాయి. *దేశీయంగా మార్కెట్‌లో 66.26 శాతం వాటా ఉన్న అతి పెద్ద బీమా సంస్థ అయిన లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) 42.2 శాతం వృద్ధి నమోదు చేసింది. ప్రీమియం చెల్లింపులు రూ. 12,055.81 కోట్లకు చేరినట్లు ఐఆర్‌డీఏఐ నివేదికలో తేలింది. ఎల్‌ఐసీ తర్వాత మార్కెట్‌లో 33.74 శాతం వాటాతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మరో 23 దేశీయ బీమా రంగ సంస్థలు 17.25 శాతం వృద్ధితో రూ. 6,153.70 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. 
*ప్రైవేటు సెక్టార్‌లోని బీమా సంస్థల్లో ఒకటైన ఎస్‌బీఐ లైఫ్‌ 49 శాతం (రూ. 1,055.32 కోట్లు), ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ 33.1 శాతం (రూ. 1,039.14 కోట్లు), ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ 21.6 శాతం(రూ. 222.26 కోట్లు), మ్యాక్స్‌ లైఫ్‌ 23.7 శాతం (రూ. 529.77 కోట్లు), కోటక్‌ మహీంద్ర లైఫ్‌ 15.25 శాతం(రూ. 403.01 కోట్లు) వృద్ధిని నమోదు చేశాయి. గత ఏడాదితో పోలిస్తే సగటున 15.25 శాతం మేర ఆదాయం పెరిగింది.
*హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రామెరికా లైఫ్‌, భారతీ యాక్సా లైఫ్‌, బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. మొత్తంగా ఏప్రిల్‌ -ఫిబ్రవరి (2018-19) ఆర్థిక సంవత్సరంలో 24 బీమారంగ సంస్థలు 7.60 శాతం వృద్ధిని నమోదు చేసి రూ. 1,77,213.57 కోట్లను ప్రీమియం చెల్లింపుల రూపంలో ఆర్జించాయి. 

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...