Sunday, 10 March 2019

రాధాదేవికి నారీశక్తి పురస్కారం

  • కులవృత్తుల్లో పురుషాధిక్యాన్ని సవాలు చేస్తూ ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన తిరుపతికి చెందిన కగ్గనపల్లి రాధాదేవి జాతీయ అత్యుత్తమమైన నారీశక్తి పురస్కారాన్ని అందుకున్నారు.
  • అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా వీరు పురస్కారంతోపాటు ప్రశంసాపత్రం, నగదు బహుమతిని అందుకున్నారు.
  • లింగవివక్షను ఎదుర్కొని.. ఏపీ మహిళా క్షురకుల సంఘం అధ్యక్షురాలైన రాధాదేవి.. తొలుత తితిదే మహిళా క్షురకుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించుకునే మహిళా భక్తుల కోసం మహిళా క్షురకులనే నియమించాలనే డిమాండ్‌ చాలాకాలంగా ఉంది. దీనిపై వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో నియామకాలను తితిదే నిలిపివేసింది. దీనిపై రాధాదేవి పోరాటం ఫలించి కల్యాణకట్టలో మహిళా క్షురకుల నియామకానికి తితిదే అనుమతించింది. ఇదే క్రమంలో చాలా మంది మహిళలు ఈ వృత్తిలోకి వచ్చేందుకు రాధాదేవి శ్రమించారు. పలువురికి శిక్షణనిచ్చారు.
  • పరిశోధనల్లో కీలక పాత్ర: షార్‌ శాస్త్రవేత్త మునుస్వామి శాంతి.. శాస్త్ర, సాంకేతిక రంగంలో మెరుగైన పనితీరు కనబరిచారు. అంతరిక్ష వాహక నౌకలకు ఆదేశాలు పంపడానికి పోర్టుబ్లెయిర్‌లో 2014లో మొదటి టెలికమాండ్‌ స్టేషన్‌ ప్రారంభించడంలో ఆమె ముఖ్యపాత్ర పోషించారు. షార్‌లో పలు పరిశోధనల్లోనూ ముఖ్య భూమిక వహించారు.

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...