Thursday, 7 March 2019

నీతిఆయోగ్‌ అభివృద్ధి ర్యాంకుల అగ్రస్థానంలో మూడు ఝార్ఖండ్‌ జిల్లాలు

దేశంలో బాగా వెనుకబడిన జిల్లాలను ప్రగతి పథంలోకి నడిపించేందుకు నీతిఆయోగ్‌ చేపట్టిన ‘ఆశావహ జిల్లాల అభివృద్ధి పథకం’ (2018-19) అమలులో ఝార్ఖండ్‌కు చెందిన మూడు జిల్లాలు అగ్రస్థానంలో నిలిచాయి. దేశవ్యాప్తంగా 112 జిల్లాలు ఈ పథకానికి ఎంపిక కాగా ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని ఛత్ర, సాహిబ్‌గంజ్‌, హజారీబాగ్‌ ముందు వరసలో నిలిచాయి. బుధవారం నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ ఈ ర్యాంకులను విడుదల చేశారు. ఆరోగ్యం, పౌష్టికాహారం పరామితుల్లో ఈ మూడు జిల్లాలు మంచి పనితీరు కనబరిచాయి.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...