Wednesday, 6 March 2019

పుల్వామా బాధితులకు రూ.110 కోట్ల విరాళం

రాజస్థాన్‌లోని కోటాకు చెందిన శాస్త్రవేత్త ముర్తజా ఏ హమీద్ (44) పుల్వామా ఉగ్ర దాడి అమరవీరులకు రూ.110 కోట్ల భూరి విరాళం ప్రకటించి దేశాన్ని సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తారు. అమరవీరుల కుటుంబాల శ్రేయస్సు కోసం ప్రధానమంత్రి జాతీయ విపత్తు నిధికి ఈ మొత్తాన్ని అందజేయనున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు.
కామర్స్‌లో పట్టభద్రుడైన హమీద్ శాస్త్రవేత్తగా మారి ప్రస్తుతం ముంబైలో పనిచేస్తున్నారు. ఫ్యూయల్ బర్న్ రేడియేషన్ టెక్నాలజీ అనే సరికొత్త విధానాన్ని ఆవిష్కరించారు.
జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) సాయం లేకుండానే ఒక వాహనం లేదా వస్తువు ఎక్కడ ఉందనే విషయాన్ని సులభంగా ఈ విధానం ద్వారా కనుగొనవచ్చు. పుల్వామా తరహా ఉగ్రదాడులు జరుగకుండా నిరోధించవచ్చు. ఈ ప్రతిపాదనను పూర్తి ఉచితంగా భారత ప్రభుత్వానికి, నేషనల్ హైవేస్ అథారిటీకి 2016 సెప్టెంబర్‌లో అందజేసినట్లు హమీద్ చెప్పారు. అయితే, రెండేండ్ల నిరీక్షణ అనంతరం 2018, అక్టోబర్‌లో కేవలం ప్రాథమిక అనుమతి మాత్రమే లభించిందని ఆయన పేర్కొన్నారు.

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...