Sunday, 10 March 2019

ఓబీసీ కోటా పెంపు ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం

ఇతర వెనుకబడిన తరగతులకు (ఓబీసీ) ప్రస్తుతం ఇస్తున్న 14 శాతం రిజర్వేషన్‌ను 27 శాతానికి పెంచుతూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆనంది బెన్ పటేల్ ఆమోదం తెలిపారు.
*సార్వత్రిక ఎన్నికల తేదీలను త్వరలోనే ప్రకటించనున్న నేపథ్యంలో ఓబీసీ రిజర్వేషన్‌ను 14 నుంచి 27 శాతం పెంచేందుకు ఆర్డినెన్స్ రూట్‌ను ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సర్కార్ ఎంచుకుంది. ఓబిసీ రిజర్వేషన్ పెంపును ఈనెల 6న ఆయన ప్రకటించారు. అనంతరం మధ్యప్రదేశ్ లోక్‌సేవ అభినియం-1994కు సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చారు. ఈ ఆర్డినెన్స్‌ను శనివారంనాడు గెజిట్‌లో పబ్లిష్ చేశారు.
*మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఎస్‌టీలకు 20 శాతం, ఎస్‌సీలకు 16 శాతం, ఓబీసీలకు 14 శాతం రిజర్వేషన్ కల్పిస్తోంది. రాష్ట్ర జనాభాలో ఓబీసీలు 52 శాతం వరకూ ఉన్నారని అంచనా. జనాభా ప్రాతిపదికగా తమకు రిజర్వేషన్లు పెంచాలంటూ ఓబీసీలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. 

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...