Friday, 8 March 2019

రూ.20 నాణెం

ప్రస్తుతం ఉన్న నాణేలకు అదనంగా కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా రూ.20 నాణేన్ని అందుబాటులోకి తెచ్చింది. వృత్తాకారంలో కనిపించే ఈ నాణేనికి 12 భుజాలు ఉంటాయి. దేశంలోని వ్యవసాయ రంగం ఆధిక్యతను ప్రతిబింబించేలా నాణెంపై ధాన్యం గింజలు ముద్రించారు. ఈ నాణెంతోపాటు కొత్త తరహా రూ.1, రూ.2, రూ.5, రూ.10 నాణేలను కూడా ప్రభుత్వం ఆవిష్కరించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొత్త తరహా రూ.1, రూ.2, రూ.5, రూ.10 నాణేలు, రూ.20 నాణేన్ని  గురువారం ఆవిష్కరించారని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ట్విటర్‌లో ప్రకటించారు. చూపు లేని వారు సైతం ఈ నాణేలను సులువుగా గుర్తించగలరని వివరించారు.  రూ.20 నాణెం బరువు 8.54 గ్రాములు ఉండగా, చుట్టుకొలత 27 మిల్లీ మీటర్లు.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...