Thursday, 7 March 2019

‘స్పార్క్‌’ రేటింగ్‌లో ఏపీకి మొదటి స్థానం

పట్టణ పేదరిక నిర్మూలన, సంక్షేమం కోసం.. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ద్వారా ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జాతీయ జీవనోపాధుల మిషన్‌ రూపొందించిన సిస్టమాటిక్‌ ప్రోగ్రెసివ్‌ అండ్‌ రియల్‌ టైం ర్యాంకింగ్‌(స్పార్క్‌)లో ఆంధ్రప్రదేశ్‌ మొదటిస్థానంలో నిలవగా.. రెండో స్థానంలో కేరళ, ఎనిమిదో స్థానంలో తెలంగాణ నిలిచాయి. ఈ సందర్భంగా మెప్మా మిషన్‌ డైరెక్టర్‌ చిన్నతాతయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పురపాలక శాఖ ఆధ్వర్యంలో మెప్మా ద్వారా అమలు చేస్తున్న స్వయం సహాయక సంఘాల బలోపేతం, స్వయం ఉపాధి, నిరుద్యోగులకు శిక్షణ, నిరాశ్రయులకు వసతి, జీవనోపాధుల కార్యక్రమాలు పరిశీలించి రాష్ట్రానికి మొదటి ర్యాంకు కేటాయించినట్లు తెలిపారు.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...