Sunday, 10 March 2019

రాష్ట్రంలో 5 పీహెచ్‌సీలకు ‘జాతీయ’ గుర్తింపు

రాష్ట్రంలోని ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ విభాగంలో ఐదు పీహెచ్‌సీలు ఎంపికైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం అందింది.
*ఎంపికైన ఐదింటిలో సిద్దిపేట జిల్లా కూకునూర్‌పల్లి పీహెచ్‌సీ 91.2 శాతం మార్కులతో అగ్రభాగాన నిలిచింది. కరీంనగర్‌ జిల్లా చల్లూరు పీహెచ్‌సీ 87.6 శాతం మార్కులతో రెండో స్థానంలో గంగాధర, కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ, శేఖరం బంజర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
*దేశవ్యాప్తంగా ఏటా ఉత్తమ సేవలందించిన పీహెచ్‌సీలను కేంద్రం ఎంపిక చేసి నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ సర్టిఫికేట్‌లు అందిస్తుంది. పీహెచ్‌సీ అభివృద్ధి కోసం వరుసగా మూడేళ్ల పాటు ఏటా రూ.3 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తుంది. 

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...