✍ కరెంట్ అఫైర్స్ 20 సెప్టెంబరు 2019 Friday ✍
తెలంగాణ వార్తలు
త్వరలో పంచాయతీ ట్రైబ్యునల్.. కలెక్టర్ చర్యలపై సర్పంచులు సులువుగా అప్పీలు చేయెుచ్చు :
i.
ట్రైబ్యునల్కు ఒక ఛైర్మన్, ఇద్దరు సభ్యులు ఉంటారు. పదవీ కాలం మూడేళ్లు. అవసరమని భావిస్తే మూడేళ్లకు ముందే వారిని ప్రభుత్వం తొలగించవచ్చు.
ii. ట్రైబ్యునల్కు ఒక కార్యదర్శిని, తగిన సంఖ్యలో సిబ్బందిని సర్కారు నియమిస్తుంది. ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంటుంది.
iii. ఏదైనా కేసును సంబంధిత ప్రాంతంలో విచారించాలని ఛైర్మన్ భావిస్తే అక్కడికే ట్రైబ్యునల్ వెళ్తుంది. అప్పీలు చేయాలనుకున్న వారు తగిన ఆధారాలతో పాటు రూ.25వేలను ఫీజుగా చెల్లించాలి.
iv. వాదనలు వినేటప్పుడు ట్రైబ్యునల్లో కనీసం ఇద్దరు సభ్యులు ఉండాలి. ఇద్దరు సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు పూర్తిస్థాయి ట్రైబ్యునల్ భేటీ అయి.. మెజార్టీకి అనుగుణంగా తుది నిర్ణయాన్ని తీసుకోవాలి.
v. పంచాయతీరాజ్ నూతన చట్టం ప్రకారం పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసినప్పుడు, విధి నిర్వహణలో చెడు నడవడిక కనబర్చినప్పుడు; ప్రభుత్వం, పంచాయతీరాజ్ కమిషనర్ లేదా తాను(కలెక్టర్) జారీ చేసే ఆదేశాలను పట్టించుకోవటంలేదని భావించినప్పుడు తగిన ముందుస్తు తాఖీదులను ఇచ్చి సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులపై కలెక్టర్ చర్యలను తీసుకోవచ్చు.
vi. అవసరమని భావిస్తే ఆ చర్యలపై 30 రోజుల్లోగా వారు ట్రైబ్యునల్లో అప్పీలు చేసుకోవచ్చు. ట్రైబ్యునల్ తీర్పుపై అప్పీలు అధికారం సర్కారుకు ఉంటుంది.
Appointments
వైమానిక దళాధిపతిగా బదౌరియా :
i.
వైమానిక దళానికి కొత్త అధిపతిగా ఎయిర్ మార్షల్ ఆర్.కె.ఎస్.బదౌరియా నియమితులు కానున్నారు.
ii.
ప్రస్తుతం వైమానిక దళాధిపతిగా ఉన్న బి.ఎస్.ధనోవా ఈ నెల 30న ఉద్యోగ విరమణ చేయనున్నందున ఆయన స్థానంలో బదౌరియాను నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బదౌరియా ప్రస్తుతం వైమానిక దళ ఉప అధిపతిగా ఉన్నారు.
Persons in news
Asian Development Bank president
Takehiko Nakao resigns :
i.
బహిరంగ, పారదర్శక మరియు మెరిట్ ఆధారిత విధానానికి అనుగుణంగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని ADB తెలిపింది.
ii.
వచ్చే ఏడాది జనవరి 16 నుంచి అమల్లోకి రానున్నట్లు, టేకికో నాకావో రాజీనామాను ప్రకటించినట్లు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ తెలిపింది.
iii.
అతను ఏప్రిల్ 28, 2013న ADB అధ్యక్షుడయ్యాడు.
iv.
ADB Headquarters (HQ) : Mandaluyong City 1550,
Metro Manila, Philippines
BOOKS
‘For the Record’ - By David Cameron :
i.
బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్ రాసిన తాజా ‘ఫర్ ద రికార్డ్’ పేరిట విడుదలైన ఈ పుస్తకంలో భారత్కు సంబంధించిన అనేక అంశాలను ఆయన స్పృశించారు.
ii.
2010-2016 మధ్య బ్రిటన్ ప్రధాన మంత్రి హోదాలో కామెరాన్ మూడుసార్లు భారత్ను సందర్శించారు. భారత్కు అత్యంత అనుకూలుడైన నేతగా గుర్తింపు పొందారు.
iii.
తాజా పుస్తకంలో మన్మోహన్ను సాధువుతో పోల్చారు. సాధువే అయినా భారత్కు ఎదురవుతున్న ముప్పుల విషయంలో ఆయన కఠినంగానే ఉన్నారు.
iv.
“జలియన్వాలా బాగ్లో 1919లో వందల మందిపై బ్రిటిష్ ఇండియన్ సైనికులు కాల్పులు జరిపారు. ఆ ఘటనపై క్షమాపణ చెప్పడం మాట అటుంచితే అప్పటివరకూ బ్రిటన్ ప్రధాని ఎవరూ అమృత్సర్ వెళ్లనే లేదు. 2013లో చేపట్టిన భారత పర్యటన సమయంలో ఈ రెండు అంశాలనూ నేను మార్చాలనుకున్నా. నేను మాత్రం ‘బ్రిటన్ చరిత్రలో అత్యంత సిగ్గుచేటైన ఘటన’గా నాటి ఊచకోతను అభివర్ణిస్తూ విచారం వ్యక్తంచేశా’’ అని చెప్పారు.
సినిమా వార్తలు
ఇంటర్నేషనల్ ఇండియన్
ఫిల్మ్ అకాడెమీ
(ఐఫా) 20వ పురస్కారాల వేడుకలు @ ముంబయి
:
i.
ఉత్తమ నటుడు - రణ్వీర్ సింగ్ (పద్మావత్)
ii.
ఉత్తమనటి - ఆలియా(రాజీ)
iii.
ఉత్తమ చిత్రం – రాజీ
iv.
ఉత్తమ దర్శకుడు - శ్రీరామ్ రాఘవన్ (అంధాధున్)
v.
‘ఐఫా’ 20వ వార్షికోత్సవం సందర్భంగా గత 20 ఏళ్లలో ఉత్తమ నటిగా దీపిక, ఉత్తమ నటుడిగా రణ్‌బీర్ కపూర్, ఉత్తమ దర్శకుడిగా రాజ్‌కుమార్ హిరాణీ, ఉత్తమ చిత్రంగా ‘కహో నా ప్యార్ హై’లకు పురస్కారాలు దక్కాయి.
ముఖ్యమైన రోజులు
అనిబిసెంట్ 86వ వర్థంతి – September 20
i.
అనిబిసెంట్ (1847 అక్టోబర్ 1 - 1933 సెప్టెంబర్ 20) ప్రముఖ బ్రిటిష్ సామ్యవాది, బ్రహ్మ జ్ఞానవాది, మహిళాహక్కుల ఉద్యమవాది, రచయిత, ఐరిష్ జాతి మహిళ.
ii.
1933 సెప్టెంబరు 20 న తమిళనాడు లోని అడయారు లో మరణించింది. ఈమె దివ్యజ్ఞాన తత్వజ్ఞి, మహిళల హక్కుల ఉద్యమకారిణి, వక్త.
iii.
ఈమె ఐర్లాండ్, భారతదేశాల స్వాతంత్ర్యం, స్వయంపాలన కొరకు పోరాడింది. స్వయం పాలన ఉద్యమం (Home rule movement) స్థాపించింది.
iv.
1880లో అనీ బిసెంట్ "హెలెనా బ్లావట్స్కీ"ని కలుసుకున్న తరువాత ఆమె ఆసక్తి సామ్యవాదం నుండి దివ్యజ్ఞానం వైపు మళ్ళింది. దివ్యజ్ఞాన సమాజం బాధ్యతలలో భాగంగా ఆమె భారతదేశం వచ్చింది. 1898లో కేంద్రీయ హిందూ కళాశాల స్థాపనకు సహకరించింది.
v.
1907లో ఆమె దివ్యజ్ఞానసమాజం అధ్యక్షురాలైంది. 1898 జూలై 7న బనారస్ లోని ఒక చిన్న ఇంట్లో తాను కలలుగన్న విద్యాసౌధాన్ని ప్రారంభించి, దానిని అలహాబాదు విశ్వవిద్యాలయంగా పేర్కొంది.
vi.
బాలగంగాధర తిలక్ 1895 లో ప్రస్తావించిన "
హోమ్ రూల్ "ను 1914 లో అనీ బిసెంట్ కార్యరూపంలో పెట్టేందుకు ప్రజల్ని సంసిద్ధులను చేయసాగింది. దీనికి సంబంధించిన కామన్ వెల్త్ అనే వార పత్రికను ఆమె ప్రారంభించినది. 1915 లో ఈమె “హౌ ఇండియా ఫైట్ ఫర్ ఫ్రీడం” అనే పుస్తకాన్ని వ్రాసింది.
vii.
ఆమె భారత రాజకీయాలలో ప్రవేశించి, భారతీయ జాతీయ కాంగ్రెస్లో సభ్యురాలైంది. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం అయిన సమయంలో హోం రూల్ లీగ్ స్వాతంత్ర్యోద్యమానికి సహకరించింది.
viii.
1917లో ఆమె భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైంది. యుద్ధానంతరం ఆమె భారతీయ స్వాతంత్ర్య పోరాటం, దివ్యజ్ఞాన సమాజ కార్యక్రమాలు రెంటినీ 1933లో మరణించే వరకు కొనసాగించింది.
ix.
ఈమెకు 1921లో కాశీ హిందూవిశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లెటర్స్ బిరుదునిచ్చి సత్కరించినది. 80సంవత్సరాల వయసులో బుడాపెస్ట్ యూరోపియన్ కాంగ్రెస్, చికాగో ప్రపంచ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించినది. 1933 సెప్టెంబర్ 20న 85 వ ఏట ఆమె బ్రిటిష్ ఇండియాలోని మద్రాస్
ప్రెసిడెన్సీలోని అడయార్‌లో తుదిశ్వాస విడిచినది.
ఎ.ఎస్. రావు 105వ జయంతి
(ECIL Founder) – September 20
i.
అయ్యగారి సాంబశివ రావు (A.S Rao 1914-2003) (జననం
: మొగల్లు, పశ్చిమ గోదావరి జిల్లా) ఒక భారతీయ శాస్త్రవేత్త మరియు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL) హైదరాబాద్ వ్యవస్థాపకుడు.
ii.
అణుశక్తి యొక్క శాంతియుత ఉపయోగాలపై యుఎన్ సమావేశాలతో సహా శాస్త్రీయ అభివృద్ధిపై అనేక అంతర్జాతీయ సమావేశాలలో రావు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అతను అనేక అంతర్జాతీయ పత్రికలతో సహా పలు శాస్త్రీయ పత్రికల సంపాదకీయ మరియు సలహా బోర్డులలో పనిచేశాడు.
iii.
1960 లో పద్మశ్రీ అవార్డు, 1965
లో ఇంజనీరింగ్ సైన్సెస్ కోసం శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు, 1972 లో పద్మ భూషణ్, 976 లో ఇంజనీరింగ్లో అత్యుత్తమ సాధనకు ఫిక్కీ అవార్డు పొందారు.
iv.
ఆయన గౌరవార్థం సికింద్రాబాద్లోని ఎ.ఎస్.రావు నగర్ (ఇసిఐఎల్ సమీపంలో) పేరు పెట్టారు. ‘ది మ్యాన్ విత్ ఎ విజన్’ అనే జీవిత చరిత్రను రావుపై అతని స్నేహితుడు
డి. మోహనా రావు రాశారు.
క్రీడలు
ఐపీఎల్లో
అత్యధిక బ్రాండ్
విలువ కలిగి
ఉన్న జట్టు
ముంబయి ఇండియన్స్ :
i.
ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) బ్రాండ్ విలువ దాదాపు రూ.48 వేల కోట్ల (6.8 బిలియన్ అమెరికా డాలర్లు)కు చేరింది. ఈ ఏడాది ఈ విలువ 13.5 శాతం పెరిగిందని డఫ్ అండ్ ఫెల్ప్స్ నివేదిక వెల్లడించింది. 2008లో ఎనిమిది జట్లతో ఆరంభమైన ఐపీఎల్ బ్రాండ్ విలువ క్రమంగా పెరుగుతూ వస్తోంది.
ii.
నాలుగు సార్లు టైటిల్ సొంతం చేసుకున్న ముంబయి ఇండియన్స్ బ్రాండ్ విలువ 8.5 శాతం పెరిగి రూ.809 కోట్లకు చేరింది. ఐపీఎల్లో అత్యధిక బ్రాండ్ విలువ కలిగి ఉన్న జట్టు ఇదే. రెండో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది.
ధనంజయపై ఏడాది
నిషేధం :
i.
శ్రీలంక యువ ఆఫ్ స్పిన్నర్ అఖిల ధనంజయపై ఐసీసీ 12 నెలల నిషేధాన్ని విధించింది. నిబంధనలకు విరుద్ధమైన బౌలింగ్ శైలిని కలిగి ఉండడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆగస్టులో న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో ధనంజయ బౌలింగ్ శైలిపై ఫిర్యాదులొచ్చాయి.
ii.
మొదట 2018 డిసెంబర్లో అతని బౌలింగ్ యాక్షన్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ ఐసీసీ సస్పెన్షన్ వేటు వేసింది. బౌలింగ్ శైలిలో మార్పులు చేసుకుని ఫిబ్రవరిలో ధనుంజయ మళ్లీ బౌలింగ్ ఆరంభించాడు. అయినా ఫిర్యాదు అందడంతో ఐసీసీ నిషేధం విధించింది.
Beijing
2022 Winter Olympic and Paralympic mascots unveiled :
i.
బీజింగ్ 2022 ఒలింపిక్ వింటర్ గేమ్స్ బిస్ డ్వెన్ డ్వెన్ (ఎల్) మరియు బీజింగ్ 2022 పారాలింపిక్ వింటర్ గేమ్స్ యొక్క చిహ్నం షుయ్ రోన్ రోన్ను చైనా రాజధాని బీజింగ్ లో 2022 ఒలింపిక్ మరియు పారాలింపిక్ వింటర్ గేమ్స్ కోసం బీజింగ్ ఆర్గనైజింగ్ కమిటీ ఆవిష్కరించింది.
India Slip to 104th spot in Latest
FIFA ranking :
i.
ఫిఫా ర్యాంకింగ్స్లో భారత ఫుట్బాల్ జట్టు 104వ స్థానానికి పడిపోయింది. భారత ఫుట్బాల్ జట్టు ఇటీవలి కాలంలో కొత్త కోచ్ ఇగోర్ స్టిమాక్ నాయకత్వంలో ఆడుతోంది.
ii.
బెల్జియం అగ్రస్థానంలో నిలవగా, ఫ్రాన్స్ బ్రెజిల్ను అధిగమించి రెండవ స్థానానికి చేరుకుంది.
iii. President of FIFA : Gianni Infantino; Headquarters of FIFA :
Zurich, Switzerland.
No comments:
Post a Comment