i.
బాలీవుడ్ నటదిగ్గజం, ‘బిగ్ బీ’ అమితాబ్ బచ్చన్ (76)కు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మక ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ను ప్రకటించింది. కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్జావడేకర్ ఈ విషయాన్ని ట్విటర్లో వెల్లడించారు.
ii.
సినీకళామతల్లికి అనితరసాధ్యమైన అపురూప సేవలు అందచేసిన వారిని 1969 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ అత్యున్నత పురస్కారంతో గౌరవిస్తోంది. భారతీయ సినీఆస్కార్గా పేర్కొనే ఈ అవార్డును అందుకోబోతున్న 50వ వ్యక్తి అమితాబ్ బచ్చన్.
iii.
ఇప్పటివరకూ 32 మంది హిందీ చిత్రసీమ ప్రముఖులను ‘దాదాసాహెబ్ ఫాల్కే’ వరించింది. తెలుగు సినిమా రంగానికి విశేష సేవలు అందించిన బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి, బి.నాగిరెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు, డి.రామానాయుడు, కె.విశ్వనాథ్‌లు ‘దాదాసాహెబ్’ గ్రహీతలే.
iv.
దాదాసాహెబ్ పురస్కారం కింద విజేతలను రాష్ట్రపతి స్వర్ణకమలం, రూ.పదిలక్షల నగదు బహుమతితో సత్కరిస్తారు.
v.
1942 అక్టోబర్ 11న యూపీలోని అలహాబాద్లో పుట్టిన అమితాబ్బచ్చన్ నటుడిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా సినీరంగానికి బహుముఖ సేవలందిస్తున్నారు.
vi.
‘సాత్ హిందుస్థానీ’ సినిమా ద్వారా సినీరంగప్రవేశం చేసిన ఆయన 2015లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు.
vii.
1984లో అమితాబ్ అలహాబాద్ లోక్‌సభస్థానం నుంచి పోటీచేసి యూపీ మాజీ సీఎం హెచ్.ఎన్. బహుగుణను ఓడించారు.
No comments:
Post a Comment