Wednesday, 18 September 2019

అసెంబ్లీ కోసం ఎర్రమంజిల్ భవనం కూల్చివేతపై హైకోర్టు తీర్పు. మంత్రిమండలి నిర్ణయం చట్ట విరుద్ధం. నిబంధన 13 రద్దు ఏకపక్షం

i.ఎర్రమంజిల్లో నూతన అసెంబ్లీ భవన నిర్మాణం చేపట్టాలన్న రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. అక్కడి చరిత్రాత్మక భవనాన్ని కూల్చొద్దని స్పష్టంచేసింది. ఎర్రమంజిల్లోని భవనాలు.. వారసత్వ కట్టడాల పరిరక్షణ పరిధిలోకి వస్తాయని తేల్చిచెప్పింది.
ii.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్తో కూడిన ధర్మాసనం 111 పేజీల తీర్పు ఇచ్చింది.
iii.బిజ్మోహన్లాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ‘సుప్రీం’ తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించింది.
iv. చట్టసభల సముదాయాన్ని నిర్మించేందుకు ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ డెక్కన్ ఆర్కియాలజికల్ అండ్ కల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధి జితేంద్రబాబు, ఎర్రమంజిల్ ప్యాలెస్ నిర్మించిన నవాబ్ వారసుడు డాక్టర్ మిర్ ఆస్గార్ హుస్సేన్, మరొకరు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
v.పట్టణాభివృద్ధి చట్టంలోని సెక్షన్ 59 ప్రకారం.. నిబంధన 13 తొలగింపు అధికారం హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ (హెచ్ఎండీఏ)కు మాత్రమే ఉంది. ప్రభుత్వానికి లేదు.
vi.చారిత్రక, వారసత్వ కట్టడాల పరిరక్షణ అనేది రాజ్యాంగంలోని అధికరణ 21 కింద జీవితంలో ఓ భాగం అంటూ సుప్రీంకోర్టు ఓ తీర్పు ఇచ్చిన విషయాన్ని హైకోర్టు గుర్తుచేసింది.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...