Wednesday, 18 September 2019

Telangana Liberation day (విమోచనదినం) (భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం) – September 17


i.          భారతదేశ చరిత్రలో మహోజ్వల ఘట్టం.. తెలంగాణ సాయుధ పోరాటం.
రాచరికం, భూస్వామ్య వ్యవస్థ, మతోన్మాదంపై ఏకకాలంలో సాగిన ఉమ్మడి సమరమది.
నిజాం నిరంకుశానికి.. భూస్వాముల అరాచకానికి, రజాకార్ల రాక్షసకాండకు వ్యతిరేకంగా జరిగిన ఉద్ధృత సాయుధ పోరాటమిది..
ii.       రైతులు ఎదిరించి.. విద్యార్థులు ఉద్యమించి.. మాతృమూర్తులు నడుం బిగించి.. అణచివేతపై పేదవాడు తన కోపాగ్నినే అంకుశంగా ఎక్కుపెట్టిన చిరస్మరణీయ యుద్ధమిది.. విమోచనా.. విలీనమా.. అనే మీమాంసలు, శషభిషలు ఎన్ని ఉన్నా మొత్తంగా చరిత్రలో ఇదో విలక్షణ పోరాటం.
iii.     భూమి కోసం.. భుక్తి కోసం.. విముక్తి కోసం.. సాగిన తెలంగాణ సాయుధ పోరాటం అత్యంత విలక్షణమైందిఅనేక నిర్బంధాలు, దాడులు, దౌర్జన్యాలు, చిత్రహింసలను ఎదుర్కొని.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిజాం రాచరికానికి, భూస్వాముల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడి  ప్రపంచంలో ఎందరికో స్ఫూర్తినిచ్చిన ఉద్యమం.
సెప్టెంబరు 17..కొన్నేళ్లుగా తేదీ చుట్టూ ఎంతో ఉద్వేగం.. ఎంతో వివాదం :
iv.     1948 సెప్టెంబరు 17 నిజాం నవాబుకు చెందిన సైన్యం భారత సైన్యానికి లొంగిపోయింది. దీంతో భారత్నడిబొడ్డున ఉన్న ఒక పెద్ద సంస్థానం చరిత్ర ముగిసింది. దేశంలో జమ్మూ-కశ్మీర్‌, నైజాం సంస్థానాలది ప్రత్యేక చరిత్ర
v.       550 పైచిలుకు ఉన్న సంస్థానాల్లో రెండే భారత్నాయకత్వ పటిమను పరీక్షించాయిపాకిస్థాన్అనుకూల శక్తులు ఒకవైపు నుంచి జమ్మూ-కశ్మీర్ను ముట్టడిస్తూ రావటంతో సంస్థానం మహారాజు హరిసింగ్‌ 1947 అక్టోబర్‌ 27 భారత యూనియన్లో విలీనం చేయడానికి అంగీకరించారు. కశ్మీర్మహారాజు లాగానే నిజాం కూడా చివరివరకూ స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నించాడు. అనివార్య పరిస్థితుల్లోనే ఇద్దరూ విలీనానికి అంగీకరించారు
vi.     రెండు సంస్థానాల విలీన ప్రక్రియలనూ, తర్వాతి పరిణామాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ప్రముఖుల్లో వి.పి.మేనన్ఒకరు. ఆనాటి దేశీయ వ్యవహారాల మంత్రిత్వశాఖలో సంస్థానాల వ్యవహారాలు ఆయన చేతి మీదుగానే జరిగాయి. సర్దార్వల్లభ్భాయ్పటేల్నేత్వత్వంలో ఆయన పనిచేశారు.
vii.  పదవీ విరమణ అనంతరం పటేల్కోరిక మేరకు సంస్థానాల విలీనంపై సమగ్ర సమాచారంతో ఒక పుస్తకం రాశారు. అందులో హైదరాబాద్సంస్థానానికి కేటాయించినన్ని పేజీలు మరే సంస్థానానికి కేటాయించలేదు. నెహ్రూ, పటేల్లు హైదరాబాద్సంస్థానానికి ఇచ్చిన ప్రాధాన్యం మరే సంస్థానికి ఇవ్వలేదని చెప్పుకోవచ్చు.
viii.    నిజాంను రాజప్రముఖుడిగా ప్రకటించారు. తన సొంత భూములను ప్రభుత్వపరం చేసినందుకు నష్టపరిహారంగా భారీ మొత్తాన్ని ఇచ్చారు. ఉదారంగా పెన్షన్సైతం ఇచ్చారు. సొంత ఆస్తులను భారీగా కలిగి ఉండటానికి అనుమతిచ్చారు.
ix.         భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు అంటే 1950 జనవరి 26 వరకూ నిజాం విడుదల చేసిన ఫర్మానా ఆధారంగానే హైదరాబాద్రాష్ట్రంలో పరిపాలన సాగింది. 1949 డిసెంబరు వరకూ మేజర్జనరల్చౌధురి ఆధ్వర్యంలో కొనసాగిన మిలిటరీ గవర్నర్కు విశేష అధికారాలిచ్చే ఫర్మానాను సైతం నవాబే విడుదల చేశారు.
x.              తర్వాత ఎం.కె.వెల్లోడిని ముఖ్యమంత్రిగా నియమించటం నైజాం చేతుల మీదుగానే సాగింది. నిజానికి వీరిద్దరి హయాంలోనే హైదరాబాద్సంస్థానం పరిపాలనా రూపురేఖలు సమూలంగా మారిపోయాయి.
xi.         అస్తవ్యస్త స్థితిని సరిదిద్దటానికి.. ముస్లింల ఆధిపత్వాన్ని పాలనా యంత్రాంగలో తగ్గించటానికి మద్రాసు, బొంబాయి రాష్ట్రాల నుంచి ఉద్యోగులను తీసుకొచ్చారు. వారి ప్రవర్తన, ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగానేఇడ్లీ సాంబార్గోబ్యాక్‌’ అనే నినాదం ఆనాడు మారుమోగింది.
అసలు వివాదం ఎందుకు మొదలైంది ?
xii.       భారత రాజ్యాంగ పరిషత్తులో చేరేది లేదని నవాబు 1947 జూన్‌ 3 ఫర్మానా విడుదలచేయటంతో హైదరాబాద్స్టేట్భవిష్యత్తుపై సందిగ్ధతకు బీజాలు పడ్డాయి. తర్వాత  భారత్‌-పాక్ల్లో దేంట్లోనూ చేరబోరని ఆగస్టు 8 నిజాం చేసిన ప్రకటనతో తేటతెల్లమైంది. గవర్నర్జనరల్గా ఉన్న మౌంట్బాటెన్చాలా చెప్పిచూశారు. స్వతంత్రంగా ఉండటం అసాధ్యమని, చివరకు అన్ని అధికారాలు పోవటం ఖాయమని కూడా హెచ్చరించారు
xiii.    విలీనానికి అంగీకరిస్తే బెరార్ప్రాంతాన్ని హైదరాబాద్సంస్థానంలో చేర్చే ప్రతిపాదనకు కూడా ఒక దశలో అంగీకరించారు. రజాకార్ల చేతుల్లో కీలుబొమ్మగా మారి యథాతథ ఒప్పందానికి తూట్లు పొడవటంతో భారత సైన్యం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా భారత్కరెన్సీని సంస్థానంలో నిషేధించటం, ఖనిజాల ఎగుమతిపై ఆంక్షలు విధించటం, రైళ్లపై దాడులు, గ్రామాల్లో రజాకారుల దారుణాలతో పరిస్థితి విషమించింది
xiv.    మేనన్అంచనా ప్రకారం 800 మందికి పైగా చనిపోయారు. 108 గంటల్లోనే భారత సైన్యం అదుపులోకి పరిస్థితి వచ్చింది. మేనన్హైదరాబాద్వచ్చి స్వయంగా పరిస్థితిని అంచనా వేశారు.
xv.        కక్ష సాధింపు దృష్టితో కానీ, మతపరమైన దృష్టితో కానీ నైజాం నవాబు పట్ల నెహ్రూ-పటేల్ద్వయం వ్యవహరించలేదు. అందుకే నైజాం ఓటమిని ఒక వీరోచిత దినంగా జరుపుకుందామని ఆనాడు భావించలేదు.
xvi.    విలీనం తర్వాత గతం తాలూకూ పాతపగలు, ఆధిపత్యాలు, వీలైనంత మేరకు స్మృతిపథం నుంచి తొలగిపోవాలన్న ఆకాంక్ష సెప్టెంబరు 17కు అధికారికంగా పెద్ద ప్రాధాన్యం ఇవ్వకుండా చేశాయి.
xvii.       సెప్టెంబరు 17ను విమోచనదినంగా అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్ఈరకంగా వచ్చిందే. అలాగే ప్రత్యేక తెలంగాణ కోరిక బలపడి, రాష్ట్రం ఏర్పాటైన తర్వాత చరిత్రలో నైజాం పాత్రపై బలమైన కొత్త వ్యాఖ్యానాలు మొదలయ్యాయి. నూతన తెలంగాణంలో నైజాం పాత్రను కూడా నూతనంగానే చూడటం మొదలుపెట్టారు. ‘తరతరాల బూజు నిజాం రాజుఅన్న వ్యాఖ్యలు క్రమేపీ కనుమరుగవుతున్నాయి.
కీలక ఘట్టాలు ఇవి :
xviii.    1947 ఆగస్టు 15 :   భారత్కు సంపూర్ణ స్వాతంత్య్రం
1947 నవంబరు 14 :  నిజాం రాజుతో భారత ప్రభుత్వం యథాతథ స్థితి ఒడంబడిక
1948 సెప్టెంబరు 12 :  హైదరాబాద్సంస్థానాన్ని సైనిక చర్యతో భారతదేశంలో విలీనం చేయాలని కేంద్ర మంత్రిమండలి తీర్మానం
1948 సెప్టెంబరు 13 :  నిజాం రాజ్యంపై పోలీసు చర్య పేరిట ముట్టడి
1948 సెప్టెంబరు 17 :  భారతదేశంలో హైదరాబాద్సంస్థానం విలీనంసైనిక పాలన ప్రారంభం
1949 డిసెంబరు 1 :    సైనికపాలన ముగింపు, హైదరాబాద్రాష్ట్రం ఏర్పాటు
1950 జనవరి 26 :    హైదరాబాద్స్టేట్తొలి సీఎంగా సీనియర్సివిల్సర్వెంట్ఎం.కె.వెల్లోడి నియామకం
xix.         ప్రస్తుతం తెలంగాణ అమరవీరుల స్మారక కమిటీకి ఛైర్మన్గా బూర్గుల నరసింగరావు ఉన్నారు.
xx.            తెలంగాణ సాయుధ పోరాట సమయానికి భాజపా లేదు, జన్సంఘ్కూడా పుట్టలేదు. పటేల్బదులు నెహ్రూనే చేసి ఉంటే తెలంగాణకు కూడా ఆర్టికల్‌ 370 ఉండేదని ఇటీవల రాంమాధవ్అన్నారు. నిర్ణయం కేంద్ర కేబినెట్ది తప్ప పటేల్ది కాదు
వీరనారి మల్లు స్వరాజ్యం :
xxi.         సూర్యాపేట జిల్లా కరివిరాళ్ల కొత్తగూడెంకు చెందిన మల్లు స్వరాజ్యం 1931లో జన్మించారు. 1947 నుంచి గెరిల్లా పోరాటాలతో నిజాం పోలీసులను, రజాకార్లను హడలెత్తించిన చరిత్ర ఆమెది.
xxii.       ఆమె తలపై 10,000 బంగారు నాణేలు బహుమతిగా ప్రకటించారు. సైనిక చర్య జరగకపోయి ఉంటే నిజాంను తరిమికొట్టేవాళ్ళు . దేశానికి స్వాతంత్య్రం వచ్చాక తుపాకులు వదిలేయమని నెహ్రూ ప్రభుత్వం కోరింది. అయినా భూస్వాములపై పోరాటం కొనసాగించారు.
xxiii.    1950లో ఆమె సహచరులు 40 మందిని కాల్చి చంపారు. 1952లో దళం నుంచి జనంలోకి వచ్చారు. మళ్లీ ఏదో ఒకరోజు తుపాకీ పట్టాల్సి వస్తుంది అనుకుని వరంగల్జిల్లా పాండవులగుట్ట ప్రాంతంలో 50 తుపాకుల్ని దాచిపెట్టి వచ్చింది

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...