Wednesday, 18 September 2019

భవిష్యత్తులో రుణ మాఫీలు వద్దు. కిసాన్ క్రెడిట్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలి. రిజర్వు బ్యాంకు అంతర్గత కమిటీ సిఫార్సు :


i.          భవిష్యత్తులో వ్యవసాయ రుణ మాఫీలు వద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రిజర్వు బ్యాంకు అంతర్గత కమిటీ సూచించింది. వ్యవసాయానికి తీసుకున్న రుణాలను ఇతర అవసరాలకు మళ్లించి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నందువల్ల ఇలాంటి పథకాలు ఆశించిన ఫలితాలు ఇవ్వవని తెలిపింది.
ii.       రుణాలను కేవలం పంటలకు ఉపయోగించుకుంటేనే సత్ఫలితాలు ఉంటాయని, అవసరమైతే రైతుల ఇతర అవసరాల కోసం వేరేగా రుణాలు మంజూరు చేయాలని తెలిపారు. అందులో భాగంగా బంగారంపై ఇచ్చే వ్యవసాయ రుణాలను ప్రత్యేకంగా చూపించాలని సిఫార్సు చేసింది
iii.     కొత్తగా మేనేజ్మెంట్ఇన్ఫర్మేషన్సిస్టంను అభివృద్ధి చేయాలని సిఫార్సు చేసింది. కేవలం కిసాన్క్రెడిట్కార్డుల ద్వారానే రుణాలు ఇవ్వాలి.
iv.      ప్రస్తుతం ఉన్న కిసాన్క్రెడిట్కార్డు నిబంధనల ప్రకారమే పూచీకత్తు లేకుండా రూ.3లక్షల వరకు ఇస్తున్న రుణ పరిమితిని ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నప్పుడు (టైఅప్అరేంజ్మెంట్స్‌) రూ.5 లక్షల వరకు పెంచాలి.
v.        వ్యక్తిగత అవసరాల కోసం రైతులకు రూ.లక్ష వరకు రుణం ఇవ్వాలి. ఏదైనా పూచీకత్తుమీదగానీ, రుణ చెల్లింపు సామర్థ్యం ఆధారంగాకానీ రుణం ఇవ్వాలి. అయితే వీటిని వ్యవసాయ రుణాలుగా చూపెట్టకూడదు.
vi.      దేశమంతటా ఒకే విధానం ఉండాలి.  ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టాలి.
vii.  వ్యవసాయ రంగంలో సంస్కరణలు అమలు చేయడానికి జీఎస్టీ మండలి తరహాలో ఒక ప్రత్యేక సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేయాలి. 2011నాటి ఆంధ్రప్రదేశ్వ్యవసాయ కౌలుదారుల చట్టం ఆదర్శప్రాయంగా ఉంది. దీన్ని దేశంలోని మిగతా రాష్ట్రాలు అనుసరించాలి.

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...