i.
ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా సంబరమైన ఒలింపిక్స్.. వచ్చే ఏడాది టోక్యో వేదికగా జులై 24 నుంచి మొదలయ్యే ఈ మెగా క్రీడల్లో పతకాలు సాధించడమే లక్ష్యంగా ఆటగాళ్లు శ్రమిస్తున్నారు.
ii.
1964లో జపాన్ తొలిసారి ఒలింపిక్స్కు ఆతిథ్యమిచ్చినపుడు నిర్మించిన ప్రధాన స్టేడియం.. 2020
ఒలింపిక్స్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
iii.
వచ్చే ఏడాది ఈ ఒలింపిక్స్ జరిగే జులై, ఆగస్టు నెలల్లో జపాన్లో వేసవి కాలం ఉంటుంది. వేసవిలో అక్కడ సాధారణంగానే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. మైదానాల దగ్గర అగ్నిమాపక యంత్రాల ద్వారా నీటిని చల్లడం, ఏసీతో కూడిన టెంట్లను ఏర్పాటు చేయడం, స్టేడియాల్లోని ప్రేక్షకుల గ్యాలరీలో కృత్రిమ మంచు కురిపించడం, పువ్వుల కంచెలు ఏర్పాటు చేయడం లాంటి ప్రయోగాల ద్వారా చల్లదనం అనుభూతిని కలిగించడానికి సిద్ధమవుతున్నారు.
iv.
ఒలింపిక్స్, పారాలింపిక్స్ మస్కట్లైన మిరైటోవా, సొమీటిల ఆకారంలో రూపొందించిన రోబోలు క్రీడల వేదికల వద్ద స్వాగతం పలకనున్నాయి. సమాచారాన్ని అందిస్తాయి.
v.
ఈ ఒలింపిక్స్ విజేతలకు బహుకరించే పసిడి, రజత, కాంస్య పతకాలకు ఓ ప్రత్యేకత ఉంది. పునిర్వినియోగానికి అనుకూలంగా ఉండే పాడైన సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి ఈ పతకాలను రూపొందించారు. ఇలా చేయడం ఒలింపిక్స్ చరిత్రలోనే ఇదే తొలిసారి.
vi.
2017 ఏప్రిల్ 1 నుంచి రెండేళ్ల పాటు సుమారు 78 వేల టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు సేకరించి.. వాటిలో నుంచి దాదాపు 32 కిలోల బంగారం, 3500 కిలోల వెండి, 2200 కిలోల కంచును బయటకు తీశారు. ఎప్పటికీ స్థిరంగా నిలిచిపోయేలా ఈ పతకాలను రూపొందించారు.
vii. ఈ ఒలింపిక్స్లో 206 దేశాల నుంచి 11 వేల మందికి పైగా అథ్లెట్లు పోటీపడబోతున్నారు. వసతి కల్పించడానికి అక్కడ ఉన్న హోటళ్లు సరిపోవు. టోక్యో సముద్ర తీరంలోని పెద్ద పెద్ద ఓడల్లోని గదులను అతిథుల కోసం అందుబాటులోకి తేనున్నారు.
viii.
ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారిగా ఈ క్రీడల కోసం ఓ ఉపగ్రహం అంతరిక్షానికి వెళ్తోంది. ‘‘జి-శాటిలైట్ గో టూ స్పేస్’’ ప్రాజెక్టు పేరుతో చిన్న ఉపగ్రహాన్ని భూ కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు జపాన్ సన్నాహాలు చేస్తోంది. ఆటల సందర్భంగా రోజులు ఈ ఉపగ్రహం కక్ష్యలో తిరుగుతూ ఉంటుంది.
ix.
ఆ దేశంలో ప్రసిద్ధమైన యానిమేషన్ క్యారక్టర్లు ‘‘గుండమ్’’, ‘‘జాకు’’లతో పాటు ఎలక్ట్రానిక్ బోర్డును ఉపగ్రహంతో పంపనున్నారు. రాకెట్ సాయంతో ఈ ఉపగ్రహాన్ని అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థకు పంపి, ఆపై కక్ష్యలో ప్రవేశపెడతారు.
x.
అది పనిచేయడం ప్రారంభించాక అంతరిక్షంలో తేలుతోన్న గుండమ్, జాకు చిత్రాలతో పాటు భూమి ఫోటోలు, ఎలక్ట్రానిక్ బోర్డు మీద సందేశాలను కిందికి పంపించనుంది.
No comments:
Post a Comment