Wednesday, 18 September 2019

రాయదుర్గంలో త్వరలో టీ హబ్ రెండో దశ


i.          రాష్ట్ర ప్రభుత్వం 2015 నవంబరులో ప్రారంభించినసాంకేతిక పరిజ్ఞాన ఇంక్యుబేటర్‌, టీ హబ్‌’ గణనీయమైన ప్రగతిని సాధించిందని, విజయోత్సాహంతో త్వరలో రెండోదశ టీ హబ్ను ఏర్పాటు చేయాలని సంకల్పించామని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు.
ii.       3.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నెలకొల్పడానికి రాయదుర్గంలో మూడెకరాల స్థలాన్ని కేటాయించామని, రూ.276 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.
iii.      2020 మార్చి నాటికి టీ హబ్రెండోదశ అందుబాటులోకి వస్తుందని, ఇందులో నిర్దేశించిన సమయంలోపే సుమారు 1000కి పైగా అంకుర పరిశ్రమలు ఏర్పాటుచేసేలా ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.
iv.     తొలిదశ టీ హబ్లో 500కి పైగా అంకుర పరిశ్రమలు ఏర్పడి, 2 వేల మందికి ఉపాధి కల్పించాయన్నారు
v.       కరీంనగర్లో త్వరలోనే ఐటీ హబ్ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని, ఖమ్మం, నిజామాబాద్‌, వరంగల్జిల్లాల్లోనూ ఐటీ హబ్ నిర్మాణాలు వేర్వేరు దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...