Thursday 19 September 2019

ప్రవాసం వెళ్తున్న వారిలో భారతీయులే అత్యధికం

i.ప్రపంచం మొత్తం మీద విదేశాలకు వలస వెళ్తున్నవారిలో మన భారతీయులే అత్యధికమని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక తేల్చింది.
2019 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా  మాతృ దేశాల నుంచి ఇతర దేశాలకు ప్రవాసం వెళ్లి ఉంటున్నవారు 27.2 కోట్ల మంది. ఇందులో 1.75 కోట్ల మంది భారతీయులే.
ii.విదేశాలకు వలసపోతున్న వారిలో భారతీయులే అత్యధికం కాగా మన దేశానికి వలస వస్తున్న వారి సంఖ్య మాత్రం తక్కువగానే ఉంటోంది. ఈ విషయంలో అగ్ర భాగాన అమెరికా ఉండగా మనం తొలి పది స్థానాల్లో కూడా లేము.
iii.2019లో భారత్కు 51లక్షల మంది వలస వచ్చారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, నేపాల్ నుంచి వచ్చినవారే అధికం. భారత్లో శరణార్థులు 2,07,000.
iv.అత్యధికంగా ఐరోపాకు 8.2 కోట్ల మంది వలస వచ్చారు.
v.అంతర్జాతీయ సరిహద్దుల్లో వలసదారులను బలవంతంగా పంపించివేయడం పెరుగుతోంది. ఉత్తరాఫ్రికా, పశ్చిమాసియాలు అత్యధికంగా 46 శాతం శరణార్థులకు ఆశ్రయమిస్తున్నాయి.

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...