Wednesday, 18 September 2019

ఇంజినీర్స్డే (సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి) - September 15


i.          నదులకు ఆనకట్టలు, దేశ ఆర్థిక పరిపుష్టికి మూలస్తంభాలను వేశారాయనతన ఇంజినీరింగ్మేధకు అద్భుత దార్శినికతను జోడించి బీడు భూములను బంగారు చేలుగా మార్చారు. ఇంజినీరుగా, దార్శనికుడిగా, నిపుణుడిగా, విద్యాప్రదాతగా, పారిశ్రామిక ప్రగతి చోదకుడిగా భారతావనిపై సర్మోక్షగుండం విశ్వేశ్వరయ్య వేసిన ముద్ర ఎన్నటికీ పదిలం.
ii.       నేటి బెంగళూరుకు సమీపంలో కొండల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామం ముద్దనహళ్లిలో 1861 సెప్టెంబర్‌ 15 తెలుగు కుటుంబంలో విశ్వేశ్వరయ్య జన్మించారు
iii.     ఆయన పుట్టిన రోజునే దేశమంతా ఇంజినీర్స్డేను ఘనంగా నిర్వహించుకుంటోంది.
iv.     విశ్వేశ్వరయ్య పుణెలోని కాలేజ్ఆఫ్సైన్స్లో సివిల్ఇంజినీరింగ్చదివి అత్యున్నతస్థానంలో నిలిచారు. 1962 ఏప్రిల్‌ 12 కన్నుమూశారు.
ఇంజినీర్గా ప్రస్థానం ప్రారంభం :
v.       ఇంజినీరింగ్తర్వాత 1884లో విశ్వేశ్వరయ్యకు బొంబాయి ప్రభుత్వంలో ప్రజాపనుల విభాగంలో సహాయ ఇంజినీర్గా ఉద్యోగం లభించింది. ఇంజినీర్గా అలా మొదలైన విశ్వేశ్వరయ్య ప్రస్థానం ఏడు దశాబ్దాల పాటు కొనసాగింది.
vi.      నీటి పరిరక్షణపై ఆయనకు అమితాసక్తి. అందుకు అనుగుణంగా ఆయన దేశవ్యాప్తంగా నీటి సరఫరా, మురుగునీటి పారుదల, సాగునీటి వ్యవస్థలకు రూపకల్పన చేశారు
vii.   కొల్హాపుర్‌, ఇండోర్‌, గ్వాలియర్‌, భోపాల్‌, నాగ్పుర్‌, గోవా, రాజ్కోట్‌, భావ్నగర్‌, బరోడా, సాంగ్లీ, బిహార్‌, ఒడిశా, యెమన్లోని అనేక నీటిసరఫరా వ్యవస్థలకు డిజైన్చేయడం కానీ సలహాదారుగా వ్యవహరించడం కానీ చేశారు.
హైదరాబాద్కు రక్షణ కవచం :
viii.    భారీ వర్షాలతో హైదరాబాద్లోని మూసీ నదికి వరదలు వచ్చేవి. ఫలితంగా వేల మంది ప్రాణాలు కోల్పోయేవారు. 1908లో నిజాం నవాబు విజ్ఞప్తి మేరకు విశ్వేశ్వరయ్య ఇక్కడ డ్రైనేజీ, తాగునీటి సరఫరా వ్యవస్థలను డిజైన్చేశారు.
ix.          దీంతో ప్రమాదకర వరదల నుంచి హైదరాబాద్కు దాదాపుగా విముక్తి లభించింది. పుణేకు ప్రధాన నీటి వనరు అయిన ఖడక్వాస్లా రిజర్వాయర్కు ఆటోమేటిక్గేట్లతో కూడిన ఒక వ్యవస్థను రూపొందించారు.
x.             మైసూరు వద్ద ఉన్న కృష్ణరాజ సాగర్డ్యామ్లోనూ ఇలాంటి వ్యవస్థనే అమర్చారు. ఎడారిగా ఉన్న మాండ్య జిల్లా.. డ్యామ్వల్ల  ధాన్యాగారంగా మారింది.
xi.         తిరుమల నుంచి తిరుపతి ఘాట్రోడ్డు నిర్మాణానికి ప్లాన్తయారుచేయడంలో విశ్వేశ్వరయ్య కీలక పాత్ర పోషించారు.
విద్యాప్రదాత :
xii.       1912లో విశ్వేశ్వరయ్య మైసూర్దివాన్గా ఎంపికయ్యారు. హోదాలో ఆయన 1912 నుంచి 1918 మధ్యకాలంలో అనేక విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు.
xiii.    పారిశ్రామికీకరణ జరగకుంటే భారతదేశానికి మనుగడ లేదు అని అన్నారు.
వాణిజ్య సంస్థలు :
xiv.    విశ్వేశ్వరయ్యను ఆధునిక మైసూర్రాష్ట్రాని (ప్రస్తుత కర్ణాటక)కి పితామహుడిగా పరిగణిస్తారు.
xv.       అనేక పరిశ్రమలు, వాణిజ్య, సాంస్కృతిక సంస్థల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.
వరించిన గౌరవాలు..
xvi.    బ్రిటిష్ప్రభుత్వం నుంచినైట్కమాండర్ఆఫ్ ఆర్డర్ఆఫ్ది ఇండియన్ఎంపైర్‌’. అప్పటి నుంచి సర్హోదా.
xvii.  1955లో భారతరత్న.
పాత ఓడను ముంచి...  విశాఖ రేవును గట్టెక్కించి..
xviii.    దేశంలోని అగ్రగామి ఓడరేవుల్లో ఒకటిగా విశాఖపట్నం పోర్ట్నిలవడం వెనక మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆలోచన అత్యంత కీలకం. 1927-33 మధ్య రేవును నిర్మిస్తున్నప్పుడు అలల పోటు ఎక్కువగా ఉండేది.
xix.         దీనిని తగ్గించడానికి అవసరమైన కాంక్రీటు అడ్డుకట్ట (బ్రేక్వాటర్స్‌) నిర్మాణ సాంకేతికత అప్పటికి ఇంకా అందుబాటులోకి రాలేదు. సమస్య తీవ్రత మోక్షగుండం దృష్టికి వెళ్లడంతో ఆయనొక సులభమైన పరిష్కారం చూపించారు.
xx.             అదేంటంటే... పాతబడిన రెండు ఓడల నిండా బండరాళ్లు వేసి, సముద్ర తీరానికి చేరువగా వాటిని ముంచేయడమే..! అది ఎంచక్కా పనిచేసి కెరటాల ఉద్ధృతిని తగ్గించింది. తర్వాత కొన్నాళ్లకు కాంక్రీటు దిమ్మలతో బ్రేక్వాటర్స్ను నిర్మించడంతో సమస్య శాశ్వతంగా పరిష్కారమయింది.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...