i.
పసిడి కల నెరవేరలేదు. కానీ పతక కరవు తీరింది. భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్లో పతకంతో మురిసింది. మూడుసార్లు ఒట్టి చేతుల్తో వెనుదిరిగిన ఈ హరియాణా అమ్మాయి నాలుగో ప్రయత్నంలో అసాధారణ పోరాటంతో కాంస్యాన్ని ముద్దాడింది.
ii.
టోక్యో ఒలింపిక్స్ బెర్తునూ ఖారారు చేసుకుని.. మరో కల సాకారం చేసుకునే దిశగా అడుగేసింది. 53 కేజీల విభాగం కాంస్య పతక పోరులో 4-1 తేడాతో గ్రీస్ రెజ్లర్ మరియాను ఓడించింది.
iii.
ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్లో పతకం సాధించిన భారత ఐదో మహిళా రెజ్లర్ వినేశ్. అంతకుముందు అల్కా తోమర్
(2006), గీతా ఫొగాట్, బబిత ఫొగాట్
(2012), పూజ దండ (2018)
పతకాలు గెలిచారు.
No comments:
Post a Comment