Wednesday, 18 September 2019

తెలుగు ఎంపీలకు స్థాయీసంఘాల పదవులు

i.కొత్తగా ఏర్పడిన పార్లమెంటరీ స్థాయీసంఘాలకు నేతృత్వం వహించే అవకాశం ముగ్గురు తెలుగు ఎంపీలకు దక్కింది.
ii. వాణిజ్యశాఖ స్థాయీసంఘానికి వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, పరిశ్రమశాఖ స్థాయీసంఘానికి తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, రవాణా, పర్యాటక, సాంస్కృతిక శాఖల స్థాయీసంఘానికి ఇటీవల భాజపాలో చేరిన టీజీ వెంకటేశ్ ఛైర్మన్లుగా వ్యవహరించనున్నారు.
iii.ఆ శాఖలకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసి పార్లమెంటుకు నివేదికలు సమర్పించడంలో వీరిది కీలకభూమిక. పార్లమెంటులోని 24 స్థాయీసంఘాల వివరాలను లోక్సభ సచివాలయం ప్రకటించింది.
iv. ఇందులో 13సంఘాలకు భాజపా సభ్యులు నేతృత్వం వహించనున్నారు. ప్రతి స్థాయీసంఘంలో 21 మంది లోక్సభ, పదిమంది రాజ్యసభ సభ్యులుంటారు.
v.పార్లమెంటులో ఆయా పార్టీల బలాన్ని బట్టి స్థాయీసంఘం అధ్యక్ష స్థానాలిస్తారు. వైకాపాకు లోక్సభలో 23, రాజ్యసభలో ఇద్దరు, తెరాసకు లోక్సభలో 9, రాజ్యసభలో ఆరుగురు సభ్యులు ఉండటంతో ఛైర్మన్ స్థానాలు దక్కాయి.
vi.విదేశాంగ వ్యవహారాలు, ఆర్థికశాఖ స్థాయీసంఘాలను ప్రతిపక్షాలకిచ్చే ఆనవాయితీకి ఈసారి మంగళం పాడారు. ఆ రెండూ భాజపా సభ్యులకే అప్పగించారు. రక్షణశాఖ స్థాయీసంఘ సభ్యుడిగా రాహుల్గాంధీ చేరారు.
vii.రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహించే 8 స్థాయీసంఘాల్లో మూడింటికి తెలుగువారిని ఛైర్మన్లుగా నియమించడంలో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు చొరవ తీసుకున్నారు.
viii.ఇలా ఒకేసారి ముగ్గురు తెలుగువారు స్థాయీసంఘాలకు నేతృత్వం వహించడం ఇదే తొలిసారి. 1993 నుంచి పార్లమెంటు స్థాయీసంఘాలు మనుగడలోకి వచ్చాయి. వీటికి మినీ పార్లమెంటు అని పేరు.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...