Sunday, 22 September 2019

త్వరలో పంచాయతీ ట్రైబ్యునల్‌.. కలెక్టర్‌ చర్యలపై సర్పంచులు సులువుగా అప్పీలు చేయెుచ్చు


త్వరలో పంచాయతీ ట్రైబ్యునల్‌.. కలెక్టర్చర్యలపై సర్పంచులు సులువుగా అప్పీలు చేయెుచ్చు :
i.          ట్రైబ్యునల్కు ఒక ఛైర్మన్‌, ఇద్దరు సభ్యులు ఉంటారు. పదవీ కాలం మూడేళ్లు. అవసరమని భావిస్తే మూడేళ్లకు ముందే వారిని ప్రభుత్వం తొలగించవచ్చు.
ii.       ట్రైబ్యునల్కు ఒక కార్యదర్శిని, తగిన సంఖ్యలో సిబ్బందిని సర్కారు నియమిస్తుంది. ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంటుంది.
iii.     ఏదైనా కేసును సంబంధిత ప్రాంతంలో విచారించాలని ఛైర్మన్భావిస్తే అక్కడికే ట్రైబ్యునల్వెళ్తుంది. అప్పీలు చేయాలనుకున్న వారు తగిన ఆధారాలతో పాటు రూ.25వేలను ఫీజుగా చెల్లించాలి.
iv.     వాదనలు వినేటప్పుడు ట్రైబ్యునల్లో కనీసం ఇద్దరు సభ్యులు ఉండాలి. ఇద్దరు సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు పూర్తిస్థాయి ట్రైబ్యునల్భేటీ అయి.. మెజార్టీకి అనుగుణంగా తుది నిర్ణయాన్ని తీసుకోవాలి.
v.       పంచాయతీరాజ్నూతన చట్టం ప్రకారం పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసినప్పుడు, విధి నిర్వహణలో చెడు నడవడిక కనబర్చినప్పుడు; ప్రభుత్వం, పంచాయతీరాజ్కమిషనర్లేదా తాను(కలెక్టర్‌) జారీ చేసే ఆదేశాలను పట్టించుకోవటంలేదని భావించినప్పుడు తగిన ముందుస్తు తాఖీదులను ఇచ్చి సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులపై కలెక్టర్చర్యలను తీసుకోవచ్చు.
vi.     అవసరమని భావిస్తే చర్యలపై 30 రోజుల్లోగా వారు ట్రైబ్యునల్లో అప్పీలు చేసుకోవచ్చు. ట్రైబ్యునల్తీర్పుపై అప్పీలు అధికారం సర్కారుకు ఉంటుంది.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...