Thursday, 19 September 2019

ఈ-సిగరెట్లపై నిషేధం : కేంద్ర మంత్రివర్గం నిర్ణయం


i.          దేశంలో కొత్త వ్యసనంలా మారిన -సిగరెట్లను నిషేధించాలని కేంద్రం నిర్ణయించింది. -సిగరెట్లను నిషేధిస్తూ అత్యవసరాదేశాలు (ఆర్డినెన్స్‌) తీసుకురావడంతో పాటు, రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానంగా ఉత్పాదకతతో ముడిపడిన బోనస్ఇవ్వడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
ii.       -సిగరెట్లను వినియోగిస్తున్న వారిలో ప్రపంచంలో చైనాది మొదటి స్థానం కాగా, భారత్ది రెండో స్థానం. మన దేశంలో దాదాపు 11 కోట్ల మంది ఉపయోగిస్తున్నారు.
iii.     -సిగరెట్లపై నిషేధాన్ని ఉల్లంఘిస్తే తొలిసారి ఏడాది జైలు, రూ. లక్ష జరిమానా విధించడానికి అవకాశం ఉంది. మళ్లీ అదే నేరానికి పాల్పడితే రూ. 5 లక్షల జరిమానా, మూడేళ్ల జైలు.. లేదంటే రెండూ విధించవచ్చు. నిల్వచేస్తే రూ.50 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష ఉంటుంది.

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...