Friday, 27 September 2019

ప్రపంచంలో అత్యంత గౌరవప్రద కంపెనీల్లో ఇన్ఫోసిస్ 3వ స్థానం @ఫోర్బ్స్ జాబితా :


i.          ప్రపంచంలోని అత్యంత గౌరవప్రద కంపెనీల జాబితాలో ఇన్ఫోసిస్కు మూడో స్థానం లభించింది. 2018 సంవత్సరంలో 31 ర్యాంకును పొందిన ఐటీ దిగ్గజం ఏడాది ఏకంగా మూడో స్థానానికి ఎగబాకడం విశేషం.
ii.        ఫోర్బ్స్‌ 250 కంపెనీలతో జాబితాను రూపొందించింది. ఇందులో ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, టాటా మోటర్స్‌, హెచ్డీఎఫ్సీ సహా 17 భారతీయ కంపెనీలు చోటు దక్కించుకున్నాయి.
iii.     ఇందులో టాటా గ్రూపునకు చెందినవే మూడు ఉండటం గమనార్హం. ప్రపంచంలో అత్యంత గౌరవప్రద కంపెనీగా చెల్లింపుల సాంకేతికత సేవల కంపెనీవీసాఅగ్రస్థానంలో నిలిచింది.
iv.     కిందటేడాది మూడో స్థానంలో ఉన్న శాన్ఫ్రాన్సిస్కో సంస్థ సారి ఏకంగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. వాల్డ్డిస్నీ తన మొదటి స్థానాన్ని కోల్పోవడమే కాకుండా 6 స్థానానికి పడిపోయింది
v.       జాబితాలో చోటు దక్కించుకున్న కంపెనీల్లో అధిక భాగం అమెరికాకు చెందినవి. మొత్తం 250 కంపెనీల్లో 59 కంపెనీలు దేశానివే. ఖండం విషయానికొస్తే 250 కంపెనీల్లో దాదాపు సగం వరకు ఆసియావే. అమెరికా తర్వాత జాబితాలో చైనా, జపాన్‌, భారత్కు చెందిన కంపెనీలు అత్యధికంగా ఉన్నాయి.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...