రాష్ట్రంలోని పంచాయతీల్లో త్వరలో దాదాపు 17 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు నియమితులయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం విధుల్లో ఉన్నవారికి, కొత్తగా చేరేవారికి నెలకు రూ.8,500 చొప్పున వేతనం ఇస్తారు . కొత్తవారి ఎంపిక విధివిధానాలపై పంచాయతీరాజ్ శాఖ నుంచి వెళ్లిన దస్త్రం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. కొత్త నియామకాలపై ప్రభుత్వం గత ఏడాదే ప్రకటించినప్పటికీ.. వరస ఎన్నికల కారణంగా దీనిపై తుది నిర్ణయం తీసుకోవడంలో జాప్యం ఏర్పడింది. ఇప్పుడు ఎన్నికలన్నీ పూర్తికావటంతో.. పంచాయతీరాజ్ శాఖ నుంచి వెళ్లిన దస్త్రం ముందుకు కదులుతున్నట్లు తెలిసింది. పంచాయతీరాజ్ శాఖ అంచనా ప్రకారం.. ప్రస్తుతం పని చేస్తున్న వారు కాకుండా ప్రతి 500 జనాభాకు ఒకరు చొప్పున లెక్కిస్తే దాదాపు 17 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు అదనంగా అవసరం.వీరికి నెలకు రూ.8,500 చొప్పున ఇచ్చేలా పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదించింది. వేతనం పెంచుతున్నందున వీరి పేరును ‘బహుళ ప్రయోజన పనివారిగా’ మార్పు చేసి గ్రామాల్లో పన్నుల వసూళ్లు తదితర పనులకూ ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది
Subscribe to:
Post Comments (Atom)
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...
-
తెలంగాణ ఆధునిక కవులు సురవరం ప్రతాపరెడ్డి : స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్. మద్రాస్‌లో లా చేశారు. రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి, పి...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
No comments:
Post a Comment