Tuesday, 25 June 2019

ఇరాన్‌పై అమెరికా తాజా ఆంక్షలు

అమెరికా ఇరాన్‌పై మరోసారి తాజాగా ఆంక్షల్ని విధించింది.ఇటీవల అమెరికా డ్రోన్‌ను ఇరాన్‌ కూల్చివేయడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకుంది. సదరు నిర్ణయానికి సంబంధించిన కార్యనిర్వాహక ఆదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూన్ 24న సంతకం చేశారు.ఇరాన్‌పై కఠినతరమైన ఆంక్షల్ని విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు.ఇరాన్‌తో, మరేతర దేశంతో సంక్షోభ పరిస్థితుల్ని తాము కోరుకోవడం లేదన్నారు.ఇరాన్‌ వద్ద అణ్వాయుధాన్ని ఉండనీయబోమని స్పష్టం చేశారు. 

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...