Thursday, 27 June 2019

నీతి ఆయోగ్ సీఈఓ పదవీకాలం రెండేళ్లు పొడిగింపు

నీతిఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్ పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడి గిస్తూ కేబినెట్ నియామకాల కమిటీ జూన్ 26న ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో 2021 జూన్ 30 వరకు నీతి ఆయోగ్ సీఈవోగా అమితాబ్ కొనసాగనున్నారు. 1980లో ఐఏఎస్‌కు ఎంపికైన అమితాబ్ కాంత్ 2016 ఫిబ్రవరి 17న నీతి ఆయోగ్ సీఈవోగా నియమితులయ్యారు. 2018లోనే ఆయన పదవీకాలం ముగియగా.. 2019 జూన్ 30 వరకు పొడగిస్తూ అప్పటి కేబినెట్ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మరోసారి రెండేళ్ల పాటు పొడిగించారు.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...