Thursday, 27 June 2019

నిర్మలా సీతారామన్‌కు అరుదైన గౌరవం

యూకె-ఇండియా సంబంధాలను మెరుగుపర్చడంలో కీలకపాత్ర పోషించిన 100 మంది ప్రభావవంతులైన మహిళల్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు చోటు దక్కింది.లండన్‌లో జూన్ 26న నిర్వహించిన ‘భారత దినోత్సవం’ సందర్భంగా యూకే హోంశాఖ కార్యదర్శి సాజిద్ జావిద్ పార్లమెంట్ హౌస్‌లో ఈ మేరకు జాబితాను విడుదల చేశారు.నిర్మలా సీతారామన్ కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రిగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల్లో కీలక పాత్ర పోషించారు. భారతదేశంలో ఈ మంత్రిత్వ శాఖను నిర్వహించిన అత్యంత ప్రభావవంతమైన మహిళగా నిర్మల గుర్తింపు పొందారు.

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...