Tuesday, 25 June 2019

ఐడీబీఐలో 600 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు

ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) 600 అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌ - ఎ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. ఎంపికైనవారు పీజీ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ కోర్సు చదవాల్సి ఉంటుంది. విజయవంతంగా ఈ కోర్సు పూర్తిచేసుకున్నవారిని విధుల్లోకి తీసుకుంటారు. ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభతో కోర్సులోకి ఎంపిక చేస్తారు.
బ్యాంకులో విధులు నిర్వహించటానికి అవసరమైన  శిక్షణ ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకుంటారు
అర్హత : డిగ్రీ 
ఎంపిక  ఆన్‌లైన్‌ పరీక్షద్వారా మరియు  ఇంటర్వ్యూ
 ఈ రెండింటిలో చూపిన ప్రతిభ ద్వారా పీజీ డిప్లొమా కోర్సులోకి తీసుకుంటారు.

ఆన్‌లైన్‌ పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు 200 మార్కులు.
రెండు గంటల వ్యవధి
 ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు.
ప్రతి తప్పు జవాబుకూ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు.

లాజికల్‌ రీజనింగ్‌, డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ నుంచి 60,
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ నుంచి 40,
 క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 40,
 జనరల్‌/ ఎకానమీ/ బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌ నుంచి 60 ప్రశ్నలు
. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలోనే
మొత్తం ఖాళీలు: 600 (అన్‌ రిజర్వ్‌డ్‌ 273, ఓబీసీ 162, ఎస్సీ 90, ఎస్టీ 45, ఈడబ్ల్యుఎస్‌ 30)
విద్యార్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: జూన్‌ 1, 2019 నాటికి 21- 28 ఏళ్ల లోపు ఉండాలి.
(అంటే జూన్‌ 2, 1991 కంటే ముందు; జూన్‌ 1, 1998 తర్వాత జన్మించినవారు అనర్హులు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి)
ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: జులై 21,
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు గడువు: జులై 3
తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.150. మిగిలిన అందరికీ రూ.౭౦౦
మరిన్ని వివరాలకు
వెబ్‌సైట్‌: https://www.idbibank.in/index.asp

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...