Thursday, 27 June 2019

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 6.84లక్షల ఖాళీలు

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 6.84 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం తాజాగా వెల్లడించింది. త్వరలోనే వీటిని భర్తీ చేస్తామని తెలిపింది.అన్ని విభాగాల్లో కలిపి 38.02లక్షల ఉద్యోగాలు ఉండగా.. వీటిల్లో మార్చి 1, 2018 నాటికి 31.18లక్షల పోస్టులను భర్తీ చేశాం. ఇంకా 6.84లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగుల పదవీ విరమణ, మరణాలు, ప్రమోషన్లు తదితర కారణాలతో ఈ పోస్టులు ఖాళీ అయ్యాయి. సంబంధిత శాఖలు, విభాగాల నియామక నిబంధనలకు అనుగుణంగా ఈ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తాం’ అని సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...