Wednesday, 26 June 2019

ఆసుపత్రి ప్రసవాల్లో తెలంగాణ నెంబర్ 1

కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వశాఖ సంయుక్తంగా ‘పురోగమన భారత్‌తో ఆరోగ్య రాష్ట్రాలు’ శీర్షికన దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పనితీరుపై రూపొందించిన నివేదిక 
 నీతిఆయోగ్‌, ప్రపంచ బ్యాంకు, ద్వారా ఈ అంశాలు విడుదల చేశారు
ముఖ్యఅంశాలు 
వైద్య ఆరోగ్య సేవల్లో భాగంగా ఆసుపత్రి ప్రసవాల్లో దేశంలో తెలంగాణ నెంబర్ 1 గా  నిలిచింది. 
అన్నిరకాల వైద్యసేవల్లో దేశంలో  తెలంగాణా 10  వ  స్తానం  సాధించింది. 
అన్నిరకాల వైద్యసేవల్లో దేశంలో  ఆంధ్రప్రదేశ్  2  వ  స్తానం  సాధించింది
2015-16లో దవాఖానాల్లో ప్రసవాలు 85.4 శాతం ఉండగా.. 2017-18లో 91.7 శాతం సాధించింది. 
 అన్ని విభాగాల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన  రాష్ట్రం గా  కేరళ రాష్ట్రం  దేశం లోనే మొదటి స్థానాన్ని  కైవసం చేసుకుంది. . 2015-16 నుంచి 2017-18కి మధ్య వైద్య ఆరోగ్య సేవల్లో పనితీరును పరిగణనలోకి తీసుకుంది.
నివేదికలోని కీలక అంశాలు 
2017-18లో అన్ని ఆరోగ్య అంశాల పనితీరులో మొత్తం అన్ని రాష్ట్రాల్లోకెల్లా కేరళ 74.01 మార్కులతో అత్యుత్తమ ప్రతిభతో అగ్రభాగాన నిలిచింది. అయితే 2015-16తో పోల్చితే మార్కుల సాధనలో తిరోగమనంలో ఉంది.
ప్రతి వెయ్యి జననాలకు నవజాత శిశు మరణాలు 12 ఉండాల్సి ఉండగా.. ఆ లక్ష్యాన్ని కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ఇప్పటికే సాధించాయి. ఈ లక్ష్య సాధనలో మహారాష్ట్ర, పంజాబ్‌ రాష్ట్రాలు సమీపంలో ఉన్నాయి.
ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల రేటును తగ్గించే అంశంలోనూ కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్‌ రాష్ట్రాలు లక్ష్యాన్ని అధిగమించాయి.
అన్ని అంశాల పనితీరులో ఉత్తరప్రదేశ్‌ 28.61 మార్కులతో చివరి స్థానాన్ని పొందింది.
చిన్న రాష్ట్రాల్లో మిజోరం 74.97 మార్కులతో తొలి స్థానంలో నిలవగా, నాగాలాండ్‌ 38.51 మార్కులతో తుది స్థానంలో నిలిచింది.
మొత్తం అన్ని అంశాల పనితీరు ప్రాతిపదికన కేరళ మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ రెండోస్థానంలో మహారాష్ట్ర, గుజరాత్‌, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్ము-కశ్మీర్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు తొలి 9 స్థానాల్లో నిలవగా.. తెలంగాణ పదో స్థానంలో ఉంది.
నవజాత శిశుమరణాల రేటును తగ్గించడంలో నిర్దేశించుకున్న ‘స్థిర అభివృద్ధి లక్ష్యసాధన’లో కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ఇప్పటికే లక్ష్యాలను అధిగమించాయి.
2015-16తో పోల్చితే 2017-18లో తెలంగాణ 11 నుంచి 10వ స్థానానికి చేరింది.
2015-16లో తెలంగాణకు 62.57 మార్కులు రాగా, 2017-18లో 64.80 మార్కులొచ్చాయి.
2016లో నవజాత శిశు మరణాల నియంత్రణలో ప్రతి వెయ్యి జననాలకు తెలంగాణలో 21 నమోదయ్యాయి.
ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల్లో 2016లో ప్రతి వెయ్యి జననాలకు తెలంగాణలో 34 నమోదయ్యాయి.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...