Friday, 28 June 2019

‘జాతీయ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ నర్సెస్‌ అవార్డు-2019’

ప్రభుత్వ వైద్యంలో నర్సింగ్‌ వృత్తిలో విశేష సేవలందించిన వారికి అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారంగా భావించే ‘జాతీయ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ నర్సెస్‌ అవార్డు ఇస్తారు 2019 సం గాను హైద్రాబాదుకు చెందిన  అస్కా సలోమీకి  ఈ అత్యున్నత పురస్కారం లభించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదించిన ఈమె పేరును కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వశాఖ ఆమోదించింది. ఈ మేరకు గురువారం దేశవ్యాప్తంగా పురస్కార గ్రహీతల జాబితాను విడుదల చేసింది. సలోమీ 2009లో గాంధీ నర్సింగ్‌ కళాశాల నుంచి ప్రధానాచార్యులుగా పదవీ విరమణ పొందారు. 

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...