Thursday, 27 June 2019

ఉత్తమ ఠాణాల జాబితా విడుదల

కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే బీపీఆర్‌డీ (బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్) జూన్ 26న ఉత్తమ ఠాణాలు-2018’ జాబితాను విడుదల చేసింది.దేశవ్యాప్తంగా ఉన్న 86 పోలీస్‌స్టేషన్‌లతో రూపొందించిన ఈ జాబితాలో రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాకి చెందిన కలు పోలీస్ స్టేషన్ మొదటిస్థానంలో నిలిచింది. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని నికోబార్‌ జిల్లాలో గల క్యాంప్‌బెల్‌ బే ఠాణా రెండో స్థానం, పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ జిల్లాలో గల ఫరక్కా ఠాణా మూడో స్థానం పొందాయి. అలాగే తెలంగాణకి చెందిన నారాయణపురం ఠాణా 14వ స్థానం, చింతపల్లి పోలీసుస్టేషన్ 24వ స్థానంలో నిలిచాయి. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో నారాయణపురం ఠాణా ఉండగా, నల్లగొండ జిల్లాలో చింతపల్లి పోలీసుస్టేషన్ ఉంది.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...