Wednesday, 26 June 2019

వెజిటేరియన్​ నీళ్లు.. కంపెనీ యాడ్ పై నెటిజన్ల ఫైర్

తిండిలో మాంసాహారం, శాకాహారం ఉన్నాయి. మరి, నీళ్ల మాటేంటి? ఎహె, ఊరుకోండి నీళ్లలోనూ వెజిటేరియన్​, నాన్​వెజిటేరియన్​ ఉంటాయా ఏంటి? అంటారా? ఈ యాడ్​ తీరు అలాగే ఉంది మరి. ఓ వాటర్​ ప్యూరిఫయర్​ ఇచ్చిన ఆ యాడ్​ ఇప్పుడు జనాన్ని ఆశ్చర్యపరిచింది. తమ ప్యూరిఫయర్లు ప్యూర్​ అండ్​ వెజిటేరియన్​ వాటర్​ ఇస్తుందని ఆ కంపెనీ యాడ్​ ఇచ్చింది.‘‘మార్కెట్లో ఎన్నో రకాల ప్యూరిఫయర్లున్నాయి. అవి నీళ్లలో ఉన్న క్రిములను చంపేస్తున్నాయి. కానీ, చచ్చిపోయిన ఆ క్రిములు నీళ్లలో అలాగే ఉండిపోతున్నాయి. అంటే అవి నాన్​వెజిటేరియన్​ నీళ్లే కదా. కానీ, మా ప్యూరిఫయర్​ మాత్రం నీళ్ల నుంచి ఆ చచ్చిపోయిన క్రిములను కూడా తొలగించేస్తుంది. కాబట్టి, స్వచ్ఛమైన వెజిటేరియన్​ నీళ్లనిస్తాయి” అంటూ ప్రకటనలో రాసుకొచ్చింది. 

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...