భారతీయ తీర రక్షక దళం డెరైక్టర్ జనరల్(డీజీ)గా తమిళనాడుకు చెందిన కె.నటరాజన్ నియమితులయ్యారు.
ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న రాజేంద్రసింగ్ పదవీ విరమణ కానున్న సందర్భంగా కొత్త డీజీగా నటరాజన్ 2019, జూలై 1 నుంచి కొనసాగుతారని కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ జూన్ 25న ప్రకటించింది. మద్రాసు విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ చేసిన నటరాజన్ 1984లో తీర రక్షణ దళంలో అసిస్టెంట్ కమాండర్‌గా చేరారు. తర్వాత పలు కీలక పదవులు చేపట్టిన ఆయన ప్రస్తుతం ముంబయిలోని పశ్చిమ ప్రాంతీయ ప్రధాన కార్యాలయం చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
No comments:
Post a Comment