Tuesday, 25 June 2019

కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అవార్డు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖకు కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అవార్డు లభించింది.
Current Affairsపాస్‌పోర్ట్ సేవా దివస్ 2019లో భాగంగా జూన్ 24న ఢిల్లీలో నిర్వహించిన పాస్‌పోర్ట్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ లో ఈ అవార్డును అందజేశారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్.జయశంకర్ నుంచి గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ ఆర్.జయలక్ష్మి ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ తరఫున అవార్డును అందుకున్నారు. పాస్‌పోర్టుల జారీ అంశంలో త్వరితగతిన పోలీసు పరిశీలన ప్రక్రియను పూర్తిచేసినందుకు ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగానికి పురస్కారం లభించింది. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే పోలీసు పరిశీలన ప్రక్రియను పూర్తి చేసిన ఏపీ నిఘా విభాగం 2018-19 సంవత్సరానికి దేశంలోనే అగ్రగామిగా నిలిచింది.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...