అదేంటి శత్రువుకు భోజనం పెట్టమని చెబుతున్నాడు ఏమైనా తెలివుందా అని అనుకుంటున్నారా ?
ఒక రాజ్యంలో శత్రు దేశ సైనికులు ఎప్పుడూ మరో రాజ్యం పైన దండెత్తి ఆ రాజ్య పంట పొలాలను రాజ్య సంపదను పాడు చేస్తూ వచ్చ్చారు .ఒక సారి ఇరు రాజ్యాలకు మధ్య యుద్ధం ప్రకటించబడింది. ఒక రాజ్య రాజుకు యుద్ధంలో శత్రువులు చిక్కారు .. వెంటనే శత్రువులందరిని బందించండి అని చెప్పాడు. అప్పుడు బందించబడిన సైనికులు గజగజ వణుకుచూ కొందరూ రోదిస్తూ ఉన్నారు .కానీ విజేత ఐన రాజు తన రాజ్యం లోని భోజన శాలకు పిలిపించి అందరికి భోజనం పెట్టించాడు.. తన మంచి తనానికి యుద్ధంలో చిక్కిన వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది .. వారు బోంచేసిన తర్వాత రాజు వారిని ఊరికే వదిలేశాడు. అప్పటి నుండి ఇరు రాజ్యాల మధ్య యుద్ధం అనేది లేకుండా రెండు రాజ్యాల ప్రజలు సుఖంగా జీవించ సాగారు..
కావున శత్రువుకు భోజనం పెట్టి వారి హృదయాన్ని గెలవండి.
మీ
కింగ్ కరెంటు అఫైర్స్ & జాబ్ న్యూస్
No comments:
Post a Comment