Wednesday, 26 June 2019

ఐదేళ్లలో తెలంగాణ అప్పులు పెరిగాయి

తెలంగాణ అప్పులకు సంబంధించి.. కేంద్రం షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది. ఐదేళ్లలో ప్రభుత్వ అప్పులు 159 శాతం పెరిగినట్లు తెలిపింది. రాజ్యసభలో.. కాంగ్రెస్ ఎంపీ ఎంఏ ఖాన్ అడిగిన ప్రశ్నకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయం తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డ నాటితో పోలిస్తే.. తెలంగాణ ప్రభుత్వ అప్పులు భారీగా పెరిగాయన్నారు. 2014 జూన్ 2 నాటికి.. తెలంగాణపై 69 వేల 517 కోట్ల అప్పులు ఉండగా.. అవి కాస్తా 2019 మార్చి చివరినాటికి లక్షా 80 వేల 239 కోట్లకు చేరాయని వివరించారు. విద్యుత్ పంపిణీ సంస్థల అప్పులను టేకోవర్ చేసేందుకు వీలుగా FRBM పరిమితికి మించి అప్పులు తీసుకోవడానికి.. రాష్ట్రాలకు ఒకసారి అనుమతించామన్నారు. అందులో ఉదయ్ పథకం కింద 8 వేల 923 కోట్ల అదనపు రుణం తీసుకోవడానికి తెలంగాణకు అనుమతించామని తెలిపారు.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...